షూటింగ్‌కు రెడీ.. బీడీ తాగుతూ విశ్వక్ సేన్ సూపర్ లుక్
విశ్వక్ సేన్ నటన, యాటిట్యూడ్, యాస ఇలా ప్రతీ ఒక్కటి యూత్‌లో బాగా పాపులర్ అయింది. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్ వంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు సక్సెస్ కావడంతో మనోడికి బాగానే ఫాలోయింగ్ పెరిగింది. ఇక చివరగా వచ్చిన హిట్ చిత్రం అతనిలోనూ నటనను బయటకు తీసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు విశ్వక్. ఆ సినిమా భారీ సక్సెస్ కావడంతో హిందీలోనూ రీమేక్ కాబోతోందన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం టాలీవుడ్‌లో షూటింగ్‌ల హడావిడి మొదలైంది. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆగిపోయినా సినిమా షూటింగ్‌లన్నీ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. ఆచితూచి ప్రతీ ఒక్కరూ సెట్ పైకి అడుగుపెడుతున్నారు. ఇప్పటి వరకు చిన్న, మీడియం రేంజ్ ప్రాజెక్ట్‌లన్నీ సెట్స్ పైకి వచ్చేశాయి. ఇక భారీ చిత్రాలు, నిర్మాణ యూనిట్స్ మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాయి. అయితే విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రం షూటింగ్ కోసం రెడీ అయినట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్‌లో ఫుల్ సందడి చేసిన ఈ హీరో ఈ మధ్య తిరుమల ట్రిప్ వేశాడు. ఫ్యామిలీతో కలిసి సరదాగా అలా గడిపాడు. ఇక ప్రస్తుతం షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ మేరకు విశ్వక్ కొత్త లుక్‌లోకి మారిపోయాడు. ఇక నోట్లో బీడీ పెట్టుకుని కాల్చుతూ ఓ లుక్కు వదిలాడు. నిజంగా మాస్ అంటే విశ్వక్ అనేలా ఉన్నాడు. ప్రస్తుతం ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలేవీ విశ్వక్ ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications











