చాలా రోజుల తరువాత ఫ్యామిలీతో అలా.. ఎంజాయ్ చేస్తోన్న విశ్వక్‌సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తెరపైనా, తెర వెనుక ఒకేలా ఉండే నటుడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్ చిత్రాలను గమనిస్తే విశ్వక్ ఎంత సహజ నటుడో అర్థమవుతుంది. నిజ జీవితంలో ఎలా ఉంటాడో తెరపైనా అంతా న్యాచురల్‌గా నటిస్తాడు. ఫలక్‌నుమా దాస్ చిత్రం సక్సెస్ కావడం, వెంటనే హిట్ వంటి కొత్త జానర్ ట్రై చేయడం, అందులో విశ్వక్ నటకు ప్రశంసలు దక్కడంతో క్రేజ్ అమాంతం పెరిగింది. హిట్ సినిమాలో విశ్వక్ నటనకు ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు

అయితే ఒకే రకమైన జానర్ చిత్రాలను చేయడం తనకు ఇష్టముండదని చెప్పిన విశ్వక్.. హిట్ సీక్వెల్‌లో నటిస్తాడో లేదో చూడాలి. లాక్ డౌన్‌లో ఇంటి పట్టునే ఉన్న విశ్వక్.. చేతనైన సాయాన్ని చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. సీసీసీకి విరాళం ఇచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఇక సోషల్ మీడియాలోనూ ఎంతో జోవియల్‌గా ఉండే విశ్వక్.. తన దర్శకుడిని ఆటపట్టించాడు. శైలేష్ కొలను స్క్రిప్ట్ చెబుతే ఉంటే విశ్వక్ ఎంతలా ఏడిపించాడో అందరం చూశాం. తాజాగా విశ్వక్ కుటుంబం, స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

Vishwak Sen Road Trip With Family To Tirumala

గత నాలుగైదు నెలలుగా అంతా ఇంటి పట్టునే ఉన్నారు. బయటి ప్రదేశాలన్నవి లేకుండా ఇంట్లో నాలుగు గోడల మధ్యే ఉన్నారు. అందుకే విశ్వక్ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను తీసుకుని రోడ్ ట్రిప్ వేసినట్టున్నాడు. ఈ మేరకు విశ్వక్ పోస్ట్ చేస్తూ.. 'ఈ విపత్కరం తరువాత ఫస్ట్ టైం రోడ్ ట్రిప్‌కు వెళ్లాం. తిరుమలను దర్శించుకున్నాం. మళ్లీ పరిస్థితులన్నీ చక్కబడతున్నాయి. ఆశే గొప్పది.. ఆశే దైవం. ధృడంగా ఉండండి.. సురక్షితంగా ఉండండ'ని అందరూ కూర్చుని భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X