నేను ఇలానే మాట్లాడతా..ఎవ్వరూ ఏం పీకలేరు..:విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్
Mechanic Rocky: వరుస విజయాలతో దూసుకువెళ్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ ( Vishwak Sen). ప్రస్తుతం మెకానిక్ రాకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 22 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు వరంగల్ లో మెకానిక్ రాకీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో విశ్వక్ సేన్ రెచ్చిపోయారు. రివ్యూయర్స్, ట్రోలర్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనం స్రుష్టిస్తున్నాయి. ఇంతకీ విశ్వక్ ఏమన్నారంటే.. ?
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అరేయ్ మీకే చెప్తున్నా. నీకే చెప్తున్నా.. మీరు నన్ను ఏం పీకలేరు.. నేను ఇట్లనే మాట్లాడుతా.. మా సినిమాను ఇలానే ప్రమోషన్ చేసుకుంటాం.. మేము తప్పు చేయట్లేదు. ఎలాంటి దొంగతనాలు చేయట్లేదు. గర్వంగా సినిమాలు చేస్తున్నాం. కాబట్టి.. నేను ట్రోల్ చేసినవారీనో.. మా గురించి తక్కువచేసి మాట్లాడిన వారినో.. వారిని ఎవర్ని ఏం అనడం లేదు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత క్రిటిక్స్, రివ్యూయర్సును గాని, ఎవరి గురించి ఏమీ మాట్లాడను ఇదే.. నా చివరి సినిమా' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

'క్రిటిక్స్, రివ్యూవర్స్.. సినిమాపై మీ అభిప్రాయం ఎలా ఉంటే అలా రాయండి. మీరు చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. రాయండి. పర్వాలేదు. కానీ, పర్సనల్ లెవెల్ లో ఎటాక్ చేస్తే మాత్రం వీపు పగులుతుంది. 'అని క్రిటిక్స్, రివ్యూస్ కు వార్నింగ్ ఇచ్చారు. 'మాకు మంచి సినిమా చేయడానికి మీరే ఒక మోటివేషన్. అయితే.. అందరికీ నచ్చిన సినిమా తీయాలని అనుకోవడం చాలా క్షష్టం. అలా అందరికీ నచ్చే సినిమాలు తీయడం సాధ్యం కాదు. మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు.. ఆ పర్సనల్ ఒపీనియన్ పై మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఉంటుంది. సో.. మేము రెస్పాండ్ అయినప్పుడూ మీకు కూడా రియాక్ట్ కానవసరం లేదు'అని పేర్కొన్నారు హీరో విశ్వక్ సేన్.
విశ్వక్ సేన్ ఇంకా మాట్లాడుతూ.. సినిమా వాళ్లకు రివ్యూయర్, క్రిటిక్స్ పై చిన్న చూపు గానీ, ద్వేషం గానీ ఉండదు. మీరు ఎప్పుడైతే.. పర్సనల్ గా అటాక్ చేస్తేనే.. మేము స్పందిస్తాం. ఈ సినిమా తర్వాత రివ్యూస్ గురించి క్రిటిక్స్ గురించి నేను మాట్లాడను. నచ్చినొళ్లు నచ్చినట్టు రాసుకోండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం కొత్త సినిమాతో వస్తాం. మీరు కూడా ఒక సినిమా గురించి రాస్తున్నప్పుడు బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నా" అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సమయంలో ఫ్యాన్స్ ఓపెన్ ఛాలెంజ్ వెయ్యమని కోరగా.. ప్రతి సినిమాకు సవాల్ చేయడం సరికాదని.. ఫ్యాన్స్ కోరిక మేరకు సవాల్ చేస్తున్నానంటూ.. 'ఈ సినిమా ఫెయిల్ అయితే.. చొక్కా లేకుండా తిరుగుతా.. ఫిలిం నగర్ లో ఉన్న ఇల్లు ఖాళీ చేస్తా.. అని నేను అస్సలు మాట్లాడను. సినిమా హిట్ అయినా.. ప్లాఫ్ అయినా.. నా చొక్కా నా ఒంటి మీదనే ఉంటుంది. నా ఇల్లు జూబ్లీహిల్స్ లోనే ఉంటుంది. ఇంకో సినిమా తీస్తా.. ఆ సినిమా కూడా హిట్ అయినా ఫెయిల్ అయిన మళ్లీ ఇంకో సినిమా తీస్తా.. పూరి జగన్నాథ్ చెప్పినట్లు.. మాకు తెలిసిందల్లా ఒకటే.. సినిమా.. సినిమా.. సినిమా.. అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీసినం ' అంటూ విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ సమయంలో విశ్వక్ సేన్ వ్యాఖ్యలకు పలువురు నెటిజన్స్ సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











