బూతులు తిడుతున్న ‘ఫలక్‌నుమా దాస్’ హీరో... సోషల్ మీడియాలో ట్రోలింగ్!
వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది చిత్రాల్లో నటించిన విశ్వక్ సేన్ తాజాగా 'ఫలక్‌నుమా దాస్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో హీరోగా నటించడంతో పాటు తానే దర్శకత్వం వహించడం విశేషం. మలయాళ హిట్ చిత్రాన్ని స్పూర్తిగా తీసుకుని హైదరాబాద్ నేటివిటీకి తగిన విధంగా కథలో మార్పులు చేసి రూపొందించిన ఈచిత్రం మే 31న విడుదలైంది.
సినిమా రిలీజ్ ముందే ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగాయి. 'అర్జున్ రెడ్డి' తరహాలో ఈ చిత్రానికి రిలీజ్ ముందే పేయిడ్ ప్రివ్యూలకు డిమాండ్ ఏర్పడింది. అయితే సినిమా రిలీజైన తర్వాత రెస్పాన్స్ మాత్రం మరోలా ఉంది. తొలి భాగం వినోదాత్మకంగా ఉన్నప్పటికీ రెండో భాగం నిరాశ పరిచిందనే టాక్ వచ్చింది.

సినిమాపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే సినిమా బాగోలేదనే కామెంట్స్ చేసిన వారిపై విశ్వక్ సేన్ విరుచుకుపడ్డారు. వారిని బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. విశ్వక్ సేన్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో అతడిపై దారుణం ట్రోలింగ్ జరుగుతోంది.
ఈ సినిమా కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హం. తొలి రోజు నైజాం ఏరియాలో పేయిడ్ ప్రివ్యూలతో కలిపి రూ. 75 లక్షల షేర్ సాధించింది. శనివారం రూ. 48 లక్షల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్ అన్ని ఏరియాల వసూళ్లు ఎంతో తెలిస్తే తప్ప సినిమా హిట్టా? ఫట్టా? అనే అంశంపై ఓ క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











