Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
'హిట్ 2' అందుకే చేయలేకపోయా.. క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్
టాలీవుడ్ లో ప్రస్తుతం సోలోగా క్రేజ్ అందుకుంటున్న వారిలో విశ్వక్ సేన్ ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా జనాల్లోకి ఈజీగా తీసుకెళ్లగల విశ్వక్.. స్టోరీ సెలెక్షన్ లో కూడా కాస్త భిన్నంగా అడుగులు వేస్తున్నాడు. ఇక నెక్స్ట్ ఈ హీరో పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
అయితే గత ఏడాది విశ్వక్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'హిట్' బాక్సాఫీస్ వద్ద బాగానే క్లిక్కయ్యింది. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఆ సినిమా నాని ప్రొడక్షన్ లోనే విడుదలైంది. అయితే ఆ సినిమాకి సీక్వెల్ రానున్నట్లు గత ఏడాది నుంచి రూమర్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గా ఇటీవల అడివి శేష్ హీరోగా సినిమా లాంచ్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
విశ్వక్ ను కాదని అడివి శేష్ ను తీసుకోవటానికి కారణం ఏమిటని అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఫైనల్ గా విశ్వక్ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఆ సినిమా చేయకపోవడానికి ముఖ్య కారణం డేట్స్ ఖాళీగా లేకపోవడమేనని వివరణ ఇచ్చారు. మూడు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల హిట్ 2 సినిమా చేయడానికి వీలు పడలేదని అన్నారు. పాగల్ సినిమా అనంతరం ఇదే ఏడాది మరో సినిమాతో వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు విశ్వక్ సేన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.