12 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న సూపర్ హిట్ కాంబో.. మాస్ డైరెక్టర్‌తో వెంకీ!
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్2. ఈ చిత్రం మల్టీస్టారర్ మూవీగా వస్తోంది. వెంకటేష్ నుంచి ఇటీవల ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకీ అభిమానులు సోలో హీరోగా ఆయన్ని మిస్ అవుతున్నారు. ఈ విషయాన్ని వెంకీ దృష్టిలో పెట్టుకున్నాడో ఏమో కానీ.. అభిమానులకు మంచి మాస్ ఎంటర్ టైనర్ ని అందించేందుకు సిద్ధం అవుతున్నారు.
12 ఏళ్ల తర్వాత సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్, మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి చిత్రం 2006లో ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత మరో చిత్రం వీరి నుంచి రాలేదు. ఇటీవల వివి వినాయక్ వెంకటేష్ కు కథ వినిపించారట. వినాయక్ చెప్పిన కథ పట్ల వెంకీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వెంకటేష్ ఈ చిత్రం చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడట. వాస్తవానికి వినాయక్ బాలయ్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ కాంబినేషన్ కుదరకపోవడంతో వినాయక్ వెంకీని లైన్లో పెట్టాడట. ఈ చిత్రానికి సి కళ్యాణ్ నిర్మించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వెంకీ ఎఫ్2 తో పాటు, వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











