బాహుబలి, RRR కు సాధ్యం కాని రికార్డ్.. వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ న్యూ ట్రెండ్ సెట్!
మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కమర్షియల్ మాస్ మొవీగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇక మెగాస్టార్ కెరిర్ లో 200 కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమాగా ఈ మూవీ నిలిచింది. ఇక నిర్మాతలకి కూడా భారీ లాభాలు తీసుకొచ్చింది.
అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా ఏకంగా 40 నుంచి 50 కోట్లు నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన రికార్డుకు చేరువైందని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో అర్ధ శతదినోత్సవం వేడుకలు జరుపుకున్న సినిమాలు అసలు లేవని చెప్పాలి. గట్టిగా రెండు మూడు వారాలు సినిమా ఆడితే చాలు అనుకునే స్టేజ్ కి నిర్మాతలు, హీరోలు వచ్చేసారు. అలాంటిది చాలా కాలం తర్వాత వాల్తేర్ వీరయ్య లాంగ్ రన్ లో ఇప్పటికి కొనసాగుతూ 50 రోజులు పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతుంది.

ఒక్క నైజాం ఏరియాలోనే 40 సెంటర్లలో వాల్తేరు వీరయ్య అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకోబోతుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆంధ్రతో కలుపుకుంటే మరో 50 సెంటర్ల వరకు 50 రోజులు పూర్తి చేసుకోవడానికి ఈ మూవీ సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఓవరాల్ గా తక్కువలో తక్కువ 90 నుంచి 100 ధియేటర్లలో వాల్తేరు వీరయ్య 50 రోజులు పూర్తిచేసుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాజమౌళి బాహుబలి సిరీస్, RRR సినిమాలు కూడా 100 సెంటర్లలో 50 రోజులు ఆడిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈ అరుదైన ఫీట్ ని మరలా సొంతం చేసుకుని అవకాశం ఉందనే మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. ఇక ఈ సినిమా 50 రోజుల పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ వేచి చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











