ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ‘సిక్స్ ప్యాక్’ సర్‌ప్రైజ్.. ఏ సినిమా నుంచో తెలిస్తే!

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ పర్‌ఫెక్ట్ హీరోగా టాలీవుడ్‌లో తనదైనా మార్కును చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇలా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న ఈ బడా హీరో.. ఈ మధ్య కాలంలో హిట్ల పరంపరతో సత్తా చాటుతున్నాడు. దీనికితోడు RRR మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. దీంతో ఫుల్ జోష్‌లో సినిమాలు చేస్తున్నాడు.

ఈ మధ్యన బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు 'దేవర' అనే హై రేంజ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అదే సమయంలో బాలీవుడ్‌లో నేరుగా 'వార్ 2' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి తెరను పంచుకుంటున్నాడు. స్పై యూనివర్శ్ నుంచి వచ్చి సక్సెస్ అయిన 'వార్' మూవీకి ఇది సీక్వెల్‌గా రాబోతుంది.

WAR 2 Movie Jr NTR Birthday Poster Release On May 20th

జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి చేస్తున్న 'వార్ 2' మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్‌లో తీస్తున్నారు. అంతేకాదు, దీనికోసం సరికొత్త టెక్నాలజీని కూడా వాడుతున్నట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది.

ఇండియాలోనే పేరున్న ఇద్దరు హీరోలు కలిసి నటిస్తోన్న 'వార్ 2' మూవీకి సంబంధించిన ప్రధానమైన షూటింగ్‌ను ఇప్పటికే మొదలు పెట్టేశారు. హృతిక్ రోషన్ గతంలోనే ఈ సినిమా షూట్‌లో పాల్గొనగా.. ఎన్టీఆర్ ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఇలా మొత్తం షూట్‌ను త్వరగా కంప్లీట్ చేసి దీన్ని 2025 ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

WAR 2 Movie Jr NTR Birthday Poster Release On May 20th

హై రేంజ్‌ యాక్షన్‌తో రూపొందుతోన్న 'వార్ 2' మూవీ నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతుందని తెలిసింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో అతడి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మే 20వ తేదీన రిలీజ్ చేస్తున్నారట. ఇందులో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడని తెలిసింది. అదే నిజం అయితే ఫ్యాన్స్‌కు పండగే అనొచ్చు.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న 'వార్ 2' మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం కోసం సదరు సంస్థ దాదాపు రూ. 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు తెలిసింది. ఇందులో ఆలియా భట్, కియారా అద్వాణీ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీతమ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X