బాలయ్య వారసుడు మోక్షజ్ఞకు స్టార్ ట్యాగ్ .. తెరపైకి ఆ రెండూ, మొదటి సినిమాకే !!

ఏళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ నందమూరి నటసింహం బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు తన కొడుకు ఫస్ట్ లుక్ , దర్శకుడు, నిర్మాత తదితర వివరాలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేయించారు బాలయ్య. దీనికి సంబంధించిన ఇతని వివరాలు త్వరలోనే తెలుపుతామని చెప్పారు. ఈ వార్తతో నందమూరి ఫ్యాన్స్ ఆనందపడుతున్నా, వారిలో చాలా డౌట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి మోక్షజ్ఞకు స్టార్ ట్యాగ్ ఏంటీ అనేది.

మోక్షజ్ఞ ఎంట్రీపై పలుమార్లు అవాంతరాలు ఎదురై ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. తమ అభిమాన హీరో కొడుకు కూడా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తే చూడాలని వారు అనుకున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఎప్పుడో కసరత్తు మొదలుపెట్టారు. కథల ఎంపిక, దర్శకులతో సంప్రదింపులు కూడా జరిపారు. తాజాగా మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సింబా ఈజ్ కమింగ్ అంటూ పోస్ట్ పెట్టి ఆయన లుక్‌ను విడుదల చేశారు.

what is the Nandamuri Balakrishna s Son Mokshagna Teja star tag here s the details

ఈ సినిమాతో బాలకృష్ణ కుమారుడు హీరోగా, చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా ఒకేసారి ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) నుంచి రెండో ప్రాజెక్ట్స్‌గా రానున్న ఈ సినిమాని ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరితో కలిసి తేజస్విని సంయుక్తంగా నిర్మించనున్నారు. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ ఇతివృత్తంతో మోక్షజ్ఞ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ఫిలింనగర్ టాక్.

మోక్షజ్ఞ గత ఫోటోలు తాజా లుక్ గమనిస్తే ఈ కుర్రాడు చాలా కష్టపడినట్లే కనిపిస్తుంది. గతంలో చాలా లావుగా ఉన్న ఆయన బరువు తగ్గి, మంచి ఫిజిక్, ఫేస్‌లు ఛార్మింగ్ సొంతం చేసుకున్నాడు. పర్సనల్ ట్రైనర్లు, నటనలో శిక్షణను ఇప్పించి మోక్షజ్ఞను అన్ని విధాలుగా రెడీ చేయడానికి బాలకృష్ణ కాస్త ఎక్కువగానే టైమ్ తీసుకున్నారని అనిపిస్తుంది. హనుమాన్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా మోక్షజ్ఞ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు.

what is the Nandamuri Balakrishna s Son Mokshagna Teja star tag here s the details

అంతాబాగానే ఉంది .. ఇండస్ట్రీలో నటీనటులకు గౌరవ సూచికంగా బిరుదులు లేదా ట్యాగ్‌లైన్‌లు కామన్. నటరత్న, నటసామ్రాట్, నటశేఖర, నటభూషణ, రెబల్ స్టార్, సూపర్‌స్టార్, మెగాస్టార్ ఇందులో కొన్ని. ఈ జనరేషన్‌‌‌లో యంగ్‌టైగర్, యంగ్ రెబల్‌స్టార్, ప్రిన్స్, పవర్‌స్టార్, ఎనర్జిటిక్ స్టార్, మెగా పవర్‌స్టార్, స్టైలీష్ స్టార్ వంటి ట్యాగ్‌లైన్స్‌ పాపులర్ . మరి మోక్షజ్ఞ తేజను ఏ ట్యాగ్‌లైన్‌తో పిలవాలా అని నందమూరి అభిమానులు తెగ మదనపడిపుతున్నారు.

తండ్రి ట్యాగ్‌లైన్‌ను కొడుక్కి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది కాబట్టి .. బాలయ్యకు ఉన్న యువరత్న, నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్స్‌ నుంచి నవ యువరత్న, జూనియర్ నటసింహం అనే కొన్ని పేర్లు సోషల్ మీడియాలో తెరపైకి వస్తున్నాయి. ఇవి కాకుండా ఆల్రెడీ బాలయ్య ఏదైనా ట్యాగ్ చేశారా అన్నది తెలియరాలేదు. అయితే ఒక్క సినిమా కూడా చేయకుండా అప్పుడే ట్యాగ్స్ ఎందుకు అనేవారు ఉన్నారు. మరి మోక్షజ్ఞ స్టార్ ట్యాగ్‌ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X