300 కోట్లు బ్లాక్ బస్టర్ మూవీ.. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ మూవీ ఏంటంటే?
ఇటీవల తెలుగు సినిమా దగ్గర తన మార్కెట్ తో ఆశ్చర్యపరిచిన సీనియర్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ అలాగే విక్టరీ వెంకటేష్ లు కనిపిస్తారని చెప్పవచ్చు. కాగా వీరి కంటే ముందు ఎప్పుడు నుంచి స్టడీ మార్కెట్ ని మైంటైన్ చేసుకుంటూ వస్తున్న సీనియర్ హీరో మాత్రం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. వారి మార్కెట్ మధ్యలో బాగా డౌన్ అయ్యింది కానీ చిరంజీవి విషయంలో మాత్రం అలా కాలేదు.
కానీ వీరు తమ రేంజ్ హిట్ కొడితే మాత్రం చిరంజీవితో సమానంగా వసూళ్లు రాబట్టగలరు అనేది ప్రూవ్ చేయడం జరిగిన సందర్భాలు ఈ మధ్య కాలంలో లేకపోలేవు. కాగా ఇలా తెలుగు సినిమా దగ్గర మన సీనియర్ హీరోస్ లో సత్తా చాటిన హీరోస్ లో వెంకీ మామ ఇటీవల రీజనల్ గా ఏకంగా 300 కోట్లకి పైగా వసూళ్లు సాధించి నెవర్ బిఫోర్ ఆల్ టైం రికార్డు సెట్ చేశారు.

కాగా తాను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' తో వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉన్న మార్కెట్ ఏంటి అనేది మళ్ళీ ప్రూవ్ అయ్యింది. కాగా దీనికి ముందు సినిమా కనీసం 10 కోట్ల షేర్ కూడా అందుకోలేదు కానీ సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా 150 కోట్ల మేర షేర్ ని అందుకోని ట్రేడ్ వర్గాల్ని విస్మయానికి లోను చేసింది.
కాగా వెంకీ మామ ఇంత పెద్ద కంబ్యాక్ ఇచ్చినప్పటికీ ఇపుడు డైలమాలోనే ఉన్నట్టుగా సినీ సర్కిల్స్ లో బజ్ వినిపిస్తుంది. మాములుగా ఏ స్టార్ హీరోకి అయినా కూడా ఆ రేంజ్ హిట్ పడితే సందేహం లేకుండా నెక్స్ట్ సినిమాలు ఆఫర్స్ వెల్లువెత్తుతాయి కానీ ఇపుడు వెంకీ మామ పరిస్థితి ఇలా కనిపించడం లేదు. అంత పెద్ద హిట్ కొట్టినప్పటికీ తన నెక్స్ట్ సినిమా కోసం ఏ దర్శకుడు ఏ నిర్మాత కూడా లైన్ లో లేనట్టే తెలుస్తుంది.
కాగా మరోపక్క సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో వెంకీ మామ నెక్స్ట్ సినిమా చాలా కేర్ తీసుకోవాలని కూడా చూస్తున్నారట. అందుకే ఆ మార్కెట్ వసూళ్లు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ గట్టి ప్రాజెక్ట్ నే పట్టాలని చూస్తున్నట్టుగా ఇంకో వెర్షన్ వినిపిస్తుంది. దీనితో అలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టినప్పటికీ నెక్స్ట్ సినిమా ఇంకా ఏంటి అనేది ఫిక్స్ చేసుకోలేకపోవడం అనేది వెంకటేష్ కి ఎంత ప్రెజర్ ని తెచ్చి పెట్టిందో అనేది అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఇదిలా ఉండగా టాలీవుడ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ ప్రకారం ఇదే సంక్రాంతికి వస్తున్నాం దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో చేయనున్న ఎంటర్టైనర్ లో వెంకీ మామ కూడా ఉంటారని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి అయితే వెంకీ మామ కెరీర్లో నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఇది కనిపిస్తుంది. కాగా ఇవి పక్కన పెడితే తన అవైటెడ్ బోల్డ్ వెబ్ సిరీస్ రానా నాయుడు అతి త్వరలోనే వరల్డ్ పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications











