twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ రాజకీయ పార్టీ బెటర్?.... నిర్మొహమాటంగా చెప్పేసిన మంచు మనోజ్!

    |

    హీరో మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ట్విట్టర్ ద్వారా ఆయన తన అభిమానులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాయడం, హైదరాబాద్ నుంచి తిరుపతి షిప్టవుతున్నట్లు అందులో పేర్కొనడం కూడా ఈ వాదనకు మరింత బలాన్ని ఇచ్చింది.

    బాలయ్య కూతురు చేసిన పనికి మంచు మనోజ్ ఫిదా, ఈ కుక్క ఫోటో ఏమిటో?బాలయ్య కూతురు చేసిన పనికి మంచు మనోజ్ ఫిదా, ఈ కుక్క ఫోటో ఏమిటో?

    రాయలసీమ వస్తున్నాను రాగి సంకటి, మటన్ పులుసు రెడీగా పెట్టండి అంటూ... మంచు మనోజ్ రాసిన ఈ లేఖలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు మాత్రమే వెల్లడించారు. తాను రాజకీయాల వైపు రావడం లేదని మనోజ్ స్పష్టం చేసినా పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు మాత్రం ఆగడం లేదు.

    పార్టీ పేరు చెప్పేసిన మంచు మనోజ్

    మంచు మనోజ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీకి ఏ పార్టీ బెటర్ అని అభిమాని ప్రశ్నించగా..... మనోజ్ ‘టీ పార్టీ' అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అయితే మనోజ్ ఇచ్చిన రిప్లై మీద రకరకాల కామెంట్స్ వచ్చాయి.

    అంటే తెలుగు దేశం పార్టీనా?

    టీ అంటే తెలుగు దేశం పార్టీనా భయ్యా... ఇండైరెక్టుగా బాగా చెప్పావ్ అంటూ ఓ అభిమాని వ్యాఖ్యానించారు.

    టీ అంటే టీడీపీ అనుకుంటారు జాగ్రత్త

    టీ అంటే టీడీపీ పార్టీ అనుకుంటారు జాగ్రత్త బ్రో... అంటూ ఓ అభిమాని మంచు మనోజ్‌కు సూచించారు.

    సేవ చేయడానికి పార్టీలతో సంబంధం లేదు

    సేవ చేయడానికి పార్టీలతో సంబంధం లేదు బ్రో, సేవా కార్యక్రమాలకు పార్టీలకు ముడి పెట్టవద్దు. మీరు వెళుతున్న మార్గం కరెక్టే అంటూ మరో అభిమాని మంచు మనోజ్‌ను అభినందించారు.

    బీర్ పార్టీ వద్దా అన్నా అంటూ ఫన్నీగా

    మరికొందరు అభిమానులు టీ పార్టీ ఎందుకు అన్నా... బీర్ పార్టీ వద్దా అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.

    English summary
    A fan asked that Which Party is best for Manoj Kumar political carrier. "Tea Party is better" Manchu Manoj replied.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X