చిరంజీవి అవార్డు ఫంక్షన్‌కు అల్లు అర్జున్ దూరం.. అదే కారణమా?

భారతీయ సినిమా పరిశ్రమలో లెజెండరీ నటుడు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు పేరిట నెలకొల్పిన జాతీయ అవార్డు ప్రధానం వేడుక ఘనంగా జరిగింది. ఈ ఏడాది పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా అందించారు. ప్రతీష్టాత్మకంగా అక్కినేని కుటుంబ సభ్యులు నిర్వహించిన ఈ వేడుకలో తెలుగు సినిమా ప్రముఖులందరూ దాదాపుగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో అల్లు అర్జున్ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. అయితే ఐకాన్ స్టార్ రాకపోవడంతో అనేక రూమర్లు మీడియా వర్గాల్లో వినిపించాయి. అయితే ఆయన రాకపోవడానికి ప్రధాన కారణం ఏమిటనే విషయంలోకి వెళితే..

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా జరిగిన వేడుకలో సినిమా పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు హాజరయ్యారు. వెంకటేష్, నాని, రాంచరణ్, రమ్యకృష్ణ, శోభితా ధూళిపాల, కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, జెమినీ కిరణ్ తదితరులు హాజరయ్యారు.

Why Allu Arjun away from Chiranjeevi and Nagarjuna Akkineni s ANR Award Function Here is reason behind absent

ఏఎన్నాఆర్ అవార్డు వేడుకలో కీరవాణి బృందం నిర్వహించిన ఆర్కెస్ట్రా అందర్నీ ఆకట్టుకొంది. అలాగే ఏఎన్నాఆర్ జీవితంపై ఆడియో, విజువల్ ప్రజెంటెషన్ ప్రతీ ఒక్కరిని ఎమోషన్స్‌కు గురి చేసింది. అనేక భావోద్వేగాల మధ్య చిరంజీవికి అమితాబ్ అవార్డును అందజేశారు. ఆ తర్వాత ప్రధాన వక్తల ప్రసంగాలకు మంచి స్పందన లభించింది.

అయితే ఈ వేడుకలో తండ్రి అల్లు అరవింద్ కనిపించినప్పటికీ.. అల్లు అర్జున్ రాకపోవడంపై చాలా మంది ఆరా తీశారు. మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలే కారణమంటూ చాలా మంది తమదైన శైలిలో అభిప్రాయపడ్డారు. అయితే చిరంజీవి అవార్డు వేడుకకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం వేరే ఉందనే విషయాన్ని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.

చిరంజీవికి అక్కినేని కుటుంబ సభ్యులు అందజేస్తున్న వేడుకలో అల్లు అర్జున్ పాల్గొనాలని ప్రయత్నించారు. ఆయన పుష్ప 2 మూవీకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్‌కు వర్క్‌ విషయాల్లో తలమునకలై ఉన్నారు. అందు చేతనే ఆయన రాలేకపోయారు. అంతకు మించి వేరే విషయాలు ఏమీ లేవు అని పేర్కొన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్న పుష్ప: ది రూల్ చిత్రం డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు దగ్గరగా ఉండటంతో ఆయన ఈ అవార్డు ఫంక్షన్‌కు రాలేకపోయారు అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X