పవన్ కల్యాణ్‌‌‌ రికార్డును బీట్ చేసిన అల్లు అర్జున్.. అందుకే స్టైలిష్ స్టార్‌కు అంత క్రేజ్

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా విశేషంగా అభిమానులను సంపాదించుకొంటున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల వైకుంఠపురంలో చిత్రంతో దిమ్మ తిరిగే బ్లాక్‌బస్టర్‌ను అందుకొన్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం కోసం రంగస్థలం ఫేమ్ సుకుమార్‌తో కలిసి పుష్ప అనే ప్రాజెక్టును మొదలుపెట్టారు. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడటంతో గృహ నిర్బంధంలోనే ఉండిపోయారు. లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..

Recommended Video

Allu Arjun Got 4.3 Billion views on Tik Tok, King of Social Media

బాలీవుడ్ హీరోల గురించి

బాలీవుడ్ హీరోల గురించి

బాలీవుడ్ సినిమాల గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నాకు అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. వారి నటన నాకు బాగా నచ్చుతుంది. వారి సినిమాలను వదలకుండా చూస్తాను. రిలీజ్ అయిందంటే ఇప్పుడెప్పుడు చూడాలనే ఆసక్తి పెరుగుతుంది అని అల్లు అర్జున్ అన్నారు.

అమీర్ ఖాన్ సినిమా 20 సార్లకంటే

అమీర్ ఖాన్ సినిమా 20 సార్లకంటే

బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటించిన జో జీతా వహీ సికందర్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నా ఫేవరేట్ సినిమాల్లో అది ఒకటి. ఆ సినిమాను నేను 20 సార్లకంటే ఎక్కువే చూశాను. ఆ సినిమాలో నాకు అమీర్ నటన చాలా నచ్చింది. అలా అమీర్ ఖాన్ నటించిన చిత్రాలను ఎక్కువ సార్లు చూసిన దాఖలాలు ఉన్నాయి అని అల్లు అర్జున్ తెలిపారు.

డీడీఎల్‌జే, గల్లీభాయ్ కూడా

డీడీఎల్‌జే, గల్లీభాయ్ కూడా

ఇక అమీర్ ఖాన్ సినిమాలే కాకుండా అత్యంత ప్రజాదరణ పొందిన దిల్ వాలే దుల్హనియా లేజాయింగే చిత్రాన్ని చాలా సార్లు చూశాను. ఆ సినిమా మ్యాజిక్ ఇప్పటికి గుర్తుండిపోయింది. ఇక గల్లీభాయ్ సినిమా 4 సార్లకంటే ఎక్కువ చూశాను. నాకు ర్యాప్ అంటే కూడా చాలా ఇష్టం. అలాగే ఆ రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్ కూడా బాగా నచ్చింది అని బన్నీ పేర్కొన్నారు.

కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అంటే..

కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అంటే..

ఇక కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అనే ట్యాగ్ నాకు రావడం హ్యాపీగా ఉంది. సోషల్ మీడియా, యూట్యూబ్, టిక్ టాక్ మీడియాలో నాకు అంత క్రేజ్ వస్తుందని ఊహించలేదు. నా అభిమానులు, సినిమా ప్రేక్షకులకు నేను రుణపడి ఉంటాను. నా చిత్రాలను ఆదరిస్తూ.. టిక్ టాక్ యాప్‌లో నా వీడియోలను వైరల్ చేయడం హ్యాపీగా ఉందని చెప్పారు. అలాగే నా సినిమాల ట్రైలర్లు, పాటలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని అన్నారు.

టిక్‌టాక్‌లో 4 బిలియన్లు

టిక్‌టాక్‌లో 4 బిలియన్లు

బాక్సాఫీస్ వద్దనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్‌కు మంచి క్రేజ్ ఉంది. కేవలం టిక్‌టాక్‌లో 4.3 బిలియన్ల వ్యూస్ రావడం విశేషం. టాలీవుడ్‌లో మరే హీరోకు ఇలాంటి రికార్డు సొంతం కాలేదు. ఆ తర్వాత స్థానాల్లో పవన్ కల్యాణ్ 2.65 బిలియన్లు, ఎన్టీఆర్ 2.12 బిలియన్లు, ప్రభాస్ 1.8 బిలియన్లు, మహేష్ బాబు 1.4 బిలియన్లు, రాంచరణ్ 1 బిలియన్, నాని 681 మిలియన్ల వ్యూస్ సాధించడం గమనార్హం. అందుకే అల్లు అర్జున్ కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అంటారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X