For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కరోనాపై మెగా ఫ్యామిలీ ఫొటో: అల్లు అర్జున్ మిస్సింగ్ వెనుక అసలు కారణం ఇదే.!

  By Manoj
  |

  స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. పోటీని తట్టుకుని నిలబడి టాప్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన తర్వాత ఆ కుటుంబం నుంచి చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. వారిలో పలువురు స్టార్లుగా వెలుగొందుతుండడంతో మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఆ హీరోలు తరచూ ఏదో ఒక మంచి పని చేస్తున్నారు. తాజాగా మరోసారి వీళ్లంతా కలిసి ఓ మంచి కార్యం చేశారు. అయితే, అందులో అల్లు అర్జున్ మిస్ అవడం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో బన్నీ మిస్సింగ్ వెనుక కారణం తెలిసింది. ఆ వివరాలు మీకోసం.!

   కరోనాపై పోరాటానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్

  కరోనాపై పోరాటానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్

  మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. దీనికి కారణం.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు ఆయన తన వంతుగా చేస్తున్న కృషే. సెలెబ్రిటీ హోదాలో ఉన్న ఆయన.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించడంతో పాటు విరాళాలు కూడా అందిస్తున్నారు. అంతేకాదు, మరికొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

  వాళ్లను ఆదుకునేందుకు చిరంజీవి ప్రయత్నం

  వాళ్లను ఆదుకునేందుకు చిరంజీవి ప్రయత్నం

  కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం ఫండ్‌కు చిరంజీవి విరాళం అందించారు. అంతేకంటే ముఖ్యంగా సినీ పరిశ్రమలోని కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ చారిటీ ‘సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీనికి ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, ఇతర నటులు, టెక్నీషియన్లు డొనేషన్స్ ఇస్తుండగా.. చిరంజీవి ముందుండి నడిపిస్తున్నారు.

  అన్ని కార్యక్రమాలకూ స్పందిస్తున్న మెగాస్టార్

  అన్ని కార్యక్రమాలకూ స్పందిస్తున్న మెగాస్టార్

  లాక్ డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఇంట్లోనే ఉంటోన్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ప్రతిసారీ స్పందిస్తున్నారు. అలాగే, కరోనాపై అవగాహణ కల్పించేందుకు ప్రత్యేకమైన వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఒకటి, హిందీలో ఒకటి వీడియో చేశారు. అలాగే, ఇంట్లోనే ఉండాలని ప్రజలకు తరచూ మెసేజ్ ఇస్తున్నారు.

   కరోనా కోసం ఒక్క చోట చేరిన మెగా ఫ్యామిలీ

  కరోనా కోసం ఒక్క చోట చేరిన మెగా ఫ్యామిలీ

  కరోనాపై పోరాటానికిమెగా ఫ్యామిలీలోని హీరోలందరూ ఇప్పటికే తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం అంతా కలిసి ఓ గ్రిడ్ ఫొటోగా ఏర్పడి మెసేజ్ ఇచ్చారు. చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, శిరీష్, నిహారిక, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శ్రీజ, కళ్యాణ్ దేవ్ ఫ్లకార్డులు పట్టుకుని ఫొటోలు దిగారు.

  మెగా ఫ్యామిలీ ఫొటోలో అల్లు అర్జున్ మిస్సింగ్

  మెగా ఫ్యామిలీ ఫొటోలో అల్లు అర్జున్ మిస్సింగ్

  మెగా ఫ్యామిలీలోని వారందరూ కలిసి ‘ఇంట్లోనే ఉంటాం.. యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు ప్రేమని పంచుతాం.. కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం.. భారతీయులం ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం' అనే సందేశం ఇచ్చారు. అయితే, ఇందులో పవన్ కల్యాణ్‌తో పాటు అల్లు అర్జున్ మిస్ అవడం చర్చనీయాంశం అవుతోంది. దీంతో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

  RRR Movie Release May Postpone Again Because Of Chiranjeevi
  అల్లు అర్జున్ మిస్సింగ్ వెనుక అసలు కారణం ఇదే.!

  అల్లు అర్జున్ మిస్సింగ్ వెనుక అసలు కారణం ఇదే.!

  మెగా ఫొటోలో అల్లు అర్జున్ మిస్సింగును మాత్రం హైలైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ లేకపోవడం వెనుక కారణం గురించి ఓ న్యూస్ లీక్ అయింది. ఇటీవల వచ్చిన ‘పుష్ప' పోస్టర్‌లోది కాకుండా.. ఆ మూవీలో బన్నీ మరో లుక్‌లో కనిపిస్తాడట. అది సర్‌ప్రైజ్‌గా ఉంటుందని తెలిసింది. దాన్ని రివీల్ చేయకూడదనే ఉద్దేశ్యంతోనే అతడు ఫొటో దిగలేదని అంటున్నారు.

  English summary
  Mega family including the newbies like 'son in law' Kalyaan Dhev and upcoming hero Vaishnav Tej featured in the mega photo grid that was shared by the whole of mega family members where they held a placard each with a word, and all the words turn into a Covid-19 related advisory.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X