50 Years of Balakrishna; బాలయ్య 50 ఇయర్స్ వేడుక.. ఆ ఇద్దరు వస్తారా? ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్!
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ , అన్నగారు నందమూరి తారక రామారావు తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి తన సత్తా చాటారరు. 1974లో తాతమ్మ కల చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ.. ఈ ఏడాదితో 50 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకోనున్నారు. దీంతో నటసింహాన్ని ఘనంగా సత్కరించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ సిద్ధమైన సంగతి తెలిసిందే.
దశాబ్ధాలుగా తెలుగు తెరకు నాలుగు స్తంభాలుగా ఉన్న నలుగురు హీరోలలో బాలయ్య ఒకరు. నలుగురు అగ్ర హీరోలలోనూ బాలయ్య ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. 60 ప్లస్‌లోనూ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు నటసింహం. సినిమాలు, షూటింగ్‌లతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ బాలయ్య చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఇక తండ్రి బాటలోనే రాజకీయాల్లోనూ అడుగుపెట్టి అక్కడా హిట్ కొట్టారు బాలకృష్ణ. నందమూరి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే హిందూపురం నుంచి ఆయన హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. సినిమాలు, రాజకీయాలు, ఆసుపత్రి వ్యవహారాలను ఏకకాలంలో పర్యవేక్షిస్తూ .. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు బాలయ్య.

సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను ఆహ్వానించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాల్లోని రెండు కేబినెట్‌లను ఆహ్వానించనున్నారు. చిత్ర పరిశ్రమ నుంచి అగ్రనటులు , హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, ఇతర టాప్ టెక్నీషీయన్స్‌కు ఆహ్వానాలు రెడీ అవుతున్నాయి. ఇంతటి ప్రతిష్టాత్మక వేడుకకు ఇద్దరు వ్యక్తులకు ఇన్విటేషన్లు వెళతాయా, వెళ్లినా వారు వస్తారా అంటూ చర్చ జరుగుతోంది.
వారిద్దరూ ఎవరో కాదు.. బాలయ్య సమకాలీకుడు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడైన నాగార్జున ఒకరైతే.. మరొకరు బాలయ్య సోదరుడు హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్. నాగార్జునతో చాలా ఏళ్లుగా బాలకృష్ణ మాట్లాడటం లేదని.. ఇద్దరి మధ్య రాకపోకలు కూడా లేవని ఇండస్ట్రీ టాక్. దీనికి కారణాలు ఏంటనేది తెలియకపోయినా.. ఎవరి వెర్షన్‌లో వారు కథలు అల్లేసుకుంటున్నారు. అలాంటిది రేపు బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్‌కు నాగార్జునకు ఆహ్వానం అందుతుందా, అందినా ఆయన వెళ్తారనేది మాత్రం డౌటే.

ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. తన అన్న కొడుకుని బాలకృష్ణ కొద్దినెలలుగా దూరం పెడుతున్నారనే టాక్ వినిపిస్తుంగా, జరుగుతున్న పరిణామాలు సైతం అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. భువనేశ్వరిని అసభ్యపదజాలంతో దూషించడం, చంద్రబాబు అరెస్ట్ సమయాల్లో ఎన్టీఆర్ స్పందించకపోవడంపై బాలయ్య ఆగ్రహంతో ఉన్నారు. అన్నింటికి మించి టీడీపీకి చావో రేవో వంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కనీసం చిన్న ట్వీట్ ద్వారా కూడా ఎన్టీఆర్ సంఘీభావం ప్రకటించలేదు. చిన్న రామారావు తీరు కరడుగట్టిన టీడీపీ వీరాభిమానులకు, ప్రత్యేకించి ఒక సామాజికవర్గానికి నచ్చలేదంటారు.
ఈ పరిణామాలతో బాలయ్యకు, ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్ పెరిగింది. మరి తాత, తండ్రుల తర్వాత తాను ఎంతో ప్రేమించే బాబాయ్ నటుడిగా 50 ఏళ్ల ప్రస్థాన వేడుకకి ఆహ్వానం అందితే ఎన్టీఆర్ హాజరవుతారో , లేదో అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే సెప్టెంబర్ 1కి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ లోపు ఏమైనా జరగొచ్చని.. ఏది ఏమైనా నాగ్, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్‌లను ఒకే వేదికపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











