రూట్ మార్చిన రవితేజ.. ఫ్లాపుల తర్వాత మాస్ మహారాజా యూటర్న్!
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌లతోపాటు ఫ్లాపులు కూడా వెంటాడటం సహజంగానే కనిపిస్తాయి. ఓ దశలో విజయాలతో దూసుకుపోయిన వారు.. మరో దశలో వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే నటీనటులు తమ వైఫల్యాలను సరిద్దిద్దుకొనేందుకు రకరకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు. తమ ఇమేజ్, తమ అభిమానుల అభిరుచికి తగినట్టుగా నటీనటులు సినిమాలు, పాత్రలను ఎంచుకోవడం చేస్తుంటారు. అయితే గత కొద్దికాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోల్లో రవితేజ ఒకరు. అయితే తనకు ఎదురైనా ఫెయిల్యూర్స్ నుంచి గట్టేందుకు విభిన్నమైన పాత్రలో ముందుకొస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆయన లేటేస్ట్ సినిమాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మాస్ మహారాజా రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఆయన నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర లాంటి మూవీస్ ఊహించని విధంగా పరాజయం పాలయ్యాయి. దాంతో ఆయన తాను ఎంచుకొనే సినిమాల విషయంలో తగిన శ్రద్ద తీసుకొంటారానే విషయం ఎంచుకొన్న చిత్రాలతో స్పష్టమవుతున్నది.

వరుసగా సినిమాలు ఫ్లాఫ్ అవుతుండటంతో ఇటీవల ఆయన తన రూట్ మార్చినట్టు కనిపిస్తున్నది. ఇటీవల తన ఇమేజ్‌కు భిన్నంగా భర్త మహాశయులకు విజ్జప్తి అనే సినిమాలో నటించారు. అయితే ఆ సినిమాతో కొంత మేరకు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యారు. ఈ సినిమా ద్వారా మోస్తారు కలెక్షన్లను రాబట్టడంలో సఫలమయ్యారు. దాంతో సక్సెస్ బాట పట్టేశారనే ఫీలింగ్‌ను ట్రేడ్ వర్గాలకు కల్పించాడు.
అయితే తన కెరీర్‌లో రవితేజ మరో భిన్నమైన సినిమాను ఎంచుకొన్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి అనే చిత్రంలో నటించేందుకు మాస్ మహారాజా సిద్దమయ్యారు. ఈ చిత్రం మైథాలజీ నేపథ్యంగా కథ సాగుతుంది. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో హారర్, థ్రిల్లర్, కామెడీ సినిమాలో నటించడానికి సిద్దంగా ఉన్నారు. ఇప్పటి వరకు రవితేజ చేయని జోనర్‌లో సినిమాలు చేస్తున్నాడనే విషయం సినీ వర్గాల్లో టాపిక్‌గా మారింది.
రవితేజ ఎంచుకొంటున్న సినిమాల గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఫ్రెష్‌గా కొత్త పాత్రలు, కథలతో రవితేజ తన సినిమాలను ఎంచుకొంటున్నారు. ఆయనలోని సత్తా, ప్రతిభను చాటిచెప్పే సినిమాలు చేయడం అభినందనీయం. త్వరలో రానున్న సినిమాలు ఆయనను కొత్తగా ఆవిష్కరిస్తాయనే అనుకొందాం అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











