ఎట్టకేలకు అజిత్‌ని వదిలిపెట్టబోతున్న డైరెక్టర్.. ఈ సారి విజయ్‌తో!
తమిళ దర్శకుడు శివ గత ఐదేళ్లలో నాలుగు చిత్రాలు తెరక్కించారు. నాలుగు సినిమాలూ హీరో తలా అజిత్ తో చేసినవే కావడం విశేషం. వీరి కాంబినేషన్ లో హిట్స్ మీద హిట్స్ పడుతుండడంతో ఫాన్స్ కు కూడా బోర్ కొట్టలేదు. రీసెంట్ గా విడుదలైన విశ్వాసం చిత్రం కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ ఎట్టకేలకు శివ అజిత్ ని వదిలిపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
తన తదుపరి చిత్రం మరో క్రేజీ హీరోతో రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇళయదళపతి విజయ్, శివ కాంబినేషన్ లో ఓ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ నిర్మాతలు ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. వరుస సినిమాలతో శివ హీరో అజిత్ కు సన్నిహితుడిగా మారిపోయాడు.

ఇక విజయ్ కు కూడా ఇలాంటి దర్శకుడే ఉన్నాడు. అతడే అట్లీ. అట్లీ, విజయ్ కాంబినేషన్ లో ప్రస్తుతం హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ చిత్రం తర్వాత శివ దర్శత్వంలో చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. శివ కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











