HBD Balakrishna: బాలయ్య తిరుగులేని రికార్డు.. ఆ హీరోలు బ్రేక్ చేయడం కష్టమేనా!

స్టార్ హీరో బాలకృష్ణ కరోనా తర్వాత వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నారు. అంతేకాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు బాలయ్య.

సీనియర్ హీరోలలో ఏ హీరో కూడా కరోనా తర్వాత వరుసగా మూడు హిట్లను అందుకోవడం జరగలేదు. ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. 1977లో నటుడిగా కెరియర్ ప్రారంభించిన బాలయ్య హీరోగా ఇప్పటివరకు 100 ప్లస్ సినిమాలలో నటించారు.

Will tollywood heros break the balakrishna hattric record full details inside

ఆరు పదుల వయసు నిండినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా రికార్డు స్థాయిలో సినిమా హిట్లు కొడుతున్న ఏకైక నటుడు బాలయ్య అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తాతమ్మకలతో సినీ నటన ప్రారంభించిన బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమాలో నటిస్తున్నారు. ఈయన ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యకపోవటం గమనార్హం.

టాలీవుడ్ లో అత్యధిక సినిమాలలో డ్యూయల్ రోల్ చేసిన నటుడిగా బాలయ్య రికార్డు క్రియేట్ చేశారు. 17 సినిమాలలో ద్విపాత్రాభినయం చేశారు. హీరోగా కాకుండా బుల్లితెర మీద హోస్ట్ గా అన్ స్టాపబుల్ షోలో కనిపించి షో ని ఓ రేంజ్ లో హిట్ చేశారు.

Will tollywood heros break the balakrishna hattric record full details inside

సినీ నటులలో హోస్ట్ గా ఆ రేంజ్ లో రాణించిన నటులు ఎవరూ లేకపోవడం గమనార్హం. హోస్టుగా కూడా బాలయ్య రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మరో రికార్డు క్రియేట్ చేశారు.

ఆరుపదుల వయసు దాటిన తర్వాత కూడా భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి వంటి సినిమాలు తీస్తూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం అనేది కేవలం బాలయ్య కి మాత్రమే సొంతం. ఆయనకి చెంఘీజ్ ఖాన్, గోనెగన్నారెడ్డి పాత్రలలో నటించాలన్నది చిరకాల కోరిక. జూన్ 10వ తేదీన ఆయన పుట్టినరోజు కావడంతో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చిరకాల కోరిక నెరవేరాలని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X