Most Handsome Men 2021: ప్రపంచంలోనే టాప్ 10లో మహేష్ బాబు.. హాలీవుడ్ హీరోలకు ధీటుగా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అతని అందానికి ఫిదా అయ్యేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మొదటి సినిమా నుంచి కూడా ఇప్పటివరకు మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా ప్రేక్షకులు అతన్నే చూస్తూ ఉంటారు. సినిమాలో ఎంత అందమైన హీరోయిన్ ఉన్నా కూడా మహేష్ బాబును ఎవరు కూడా డామినేట్ చేయలేరు అనే చెప్పాలి. ఇక 2021 మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ లొస్తులో మహేష్ బాబు టాప్ టెన్ లో ఉండడం విశేషం.

అతన్ని చూస్తే చాలు..

అతన్ని చూస్తే చాలు..

టాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ బాబు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లోనే అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో ఒకరు. కేవలం నటన పరంగానే కాకుండా మహేష్ బాబు తన హ్యాండ్సమ్ లుక్స్ తో కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వగలడు. తెరపై అతన్ని చూస్తూ ఉంటే చాలు అని థియేటర్కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్స్ నుంచి కొత్తగా రాబోయే హీరోయిన్స్ వరకు అందరూ కూడా అతనితో వర్క్ చేయాలని అనుకుంటారు

క్రేజ్ పెంచుకుంటూనే ఉన్నాడు

క్రేజ్ పెంచుకుంటూనే ఉన్నాడు

ఇక ఇటీవల కాలంలో అత్యంత అందమైన హీరోలపై సర్వేలు నిర్వహిస్తే అందులో ఎక్కువగా మహేష్ బాబు టాప్ లో నిలవడం విశేషం. ఇండియాలో దాదాపు చాలా మంది ప్రేక్షకులు కూడా మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో ఎవరు అని అనగానే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే పేరు మహేష్ బాబు అనే చెప్పాలి. సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మహేష్ బాబు క్రేజ్ పెంచుకుంటూనే ఉన్నాడు.

ప్రపంచంలోలోనే.. టాప్ 10లో మహేష్

ప్రపంచంలోలోనే.. టాప్ 10లో మహేష్

ఇక ఇటీవల నిర్వహించిన సర్వేలో మహేష్ బాబు 2021 వరల్డ్ మోస్ట్ హ్యాండ్సమ్ లిస్టులో టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీ నుంచి నెంబర్ వన్ స్థానంలో నిలిచిన మహేష్ బాబు ఇండియా మొత్తంలో రెండో స్థానంలో నిలవడం విశేషం. ఈ దెబ్బతో మహేష్ బాబు స్థాయి ఏమిటో మరోసారి చాలా క్లారిటీగా అర్థం అయింది.

ఆ అందానికి ఇచ్చే వాల్యూ ఇది..

ఆ అందానికి ఇచ్చే వాల్యూ ఇది..

మహేష్ బాబు అందానికి ఇచ్చే వ్యాల్యు ఎంత అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ అందానికి ఇచ్చే వాల్యూ ఇదే అని మహేష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. ప్రపంచంలో మోస్ట్ మోస్ట్ హ్యాండ్సమ్ లిస్టులో మహేష్బాబు 10వ స్థానంలో నిలిచారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం సంబంధించిన లిస్టు కూడా వైరల్ అవుతుంది. బాబు ఫోటోలు ఎప్పటిలాగానే షేర్ చేసుకుంటూ ఈ విషయాన్ని మరింత మందికి చేరువ ఎలా చేస్తున్నారు.

3వ స్థానంలో హృతిక్ రోషన్

3వ స్థానంలో హృతిక్ రోషన్

ఇక ఇండియాలో మోస్ట్ హ్యాండ్సమ్ లిస్టులో హృతిక్ రోషన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అతను మూడవ స్థానంలో నిలవడం విశేషం. ప్రతి సారి కూడా హృతిక్ రోషన్ నెంబర్ వన్ స్థానాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక ప్రపంచంలోనే మోస్ట్ హ్యాండ్సమ్ మెన్స్ లో అతనికి 3వ స్థానం లభించింది.

నెంబర్ వన్ లో అతడే..

నెంబర్ వన్ లో అతడే..

హ్యారీ పోటర్ నటుడు రాబర్ట్ డగ్లస్ థామస్ ప్యాటిన్సన్ ప్రపంచంలో అత్యంత అందగాడిగా మొదటి స్థానంలో నిలిచారు. ప్రపంచంలోని టాప్ 10 మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ 2021 లలిస్టులో క్రిస్ ఎవాన్స్ రెండవ స్థానంలో ఉండగా.. మూడవ స్థానంలో హృతిక్ రోషన్, 4 ఒమర్ బోర్కాన్ అల్ గాలా , 5 డేవిడ్ బెక్‌హామ్, 6 టామ్ క్రూజ్, 7 కిమ్ టే-హ్యూంగ్, 8 జైన్ మాలిక్, 9 క్రిస్ హెమ్స్‌వర్త్ ఉండగా 10వ స్థానంలో

మహేష్ బాబు నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X