Pushpa క్రేజ్ 'తగ్గేదే లే'.. డబ్ల్యూడబ్ల్యూఈకి పాకిన అల్లు అర్జున్ మేనరిజం!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమా అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు కేవలం దక్షిణాదికే పరిమితమైన అల్లు అర్జున్ ఉత్తరాదిలో కూడా ఈ సినిమాతో సత్తా చాటాడు. అల్లు అర్జున్ నటనకు మంచి ప్రశంసలు దక్కడమే కాక సినిమాలో ఆయన చూపిన మేనరిజంకి కూడా మంచి క్రేజ్ లభించింది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు ఆయన మేనరిజం ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేసి దన పెద్ద ఎత్తున వైరల్ అయ్యేలా చేయగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా చూసే డబ్ల్యూడబ్ల్యూఈ షోలో ఒక రెజ్లర్ అల్లు అర్జున్ మేనరిజం చేసి చూపించి ఆసక్తి రేగెత్తించాడు. ఆ వివరాల్లోకి వెళితే

ఆసక్తికరంగా
అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్. నిజానికి ఈ సినిమాను ఒకే భాగంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టి చేస్తూ వెళ్లిన తరువాత ఒక భాగంలో విడుదల చేయడం కష్టమని భావించి రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేసి మొదటి భాగాన్ని డిసెంబర్ నెల 2021 లో విడుదల చేశారు. సినిమా మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద దృష్టి పెట్టి దాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు మేకర్స్.

డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగులు, మేనరిజంకి మంచి క్రేజ్ ఏర్పడింది. నార్త్ నుంచి సెలబ్రిటీలు సహా విదేశాలకు చెందిన క్రికెటర్లు కూడా అల్లు అర్జున్ మేనరిజం చేసి చూపిస్తూ రీల్స్ చేసి వైరల్ అయ్యేలా చేశారు. నీ అవ్వ తగ్గేదేలే అంటూ బన్నీ తన గడ్డాన్ని సవరించుకుంటూ చెప్పే డైలాగ్ మాత్రం చాలా ఫేమస్ అయిందని చెప్పాలి. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ ఒకరు ఇదేవిధంగా చూపించి ఆసక్తి రేకెత్తించారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కు చెందిన ప్రముఖ రెజ్లర్ సౌరవ్ గుర్జార్ కొంతకాలంగా డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ పోటీలలో పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన ఒక మ్యాచ్లో తన ప్రత్యర్థితో పోటీపడుతూ ఆయన అల్లు అర్జున్ మేనరిజం చేసి చూపించడమే కాక దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అల్లు అర్జున్ ని ట్యాగ్ చేశారు.

ఆడిషన్స్ కూడా
ఈ దెబ్బతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక పక్క పండగ చేసుకుంటున్నారు. మా హీరో స్థాయి ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతుంది అంటూ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి పుష్ప రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పని పూర్తి చేసే పనిలోపడ్డారు దర్శకుడు సుకుమార్. మరోపక్క ఆయన డైరెక్షన్ టీం ఆడిషన్స్ కూడా నిర్వహిస్తోంది.

చిత్తూరు యాస కోసం
తిరుపతిలో మూడు రోజులపాటు చిత్తూరు యాసలో మాట్లాడే వారి కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ శుక్రవారం నాడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ప్రకటన మీద బన్నీ అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొంతమంది గట్టిగా ప్లాన్ చేయమని సలహాలు ఇస్తుంటే మరికొందరు ఇప్పటికీ ఇంకా ఆడిషన్స్ లెవెల్ లో ఉంటే సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











