Yash కేజీఎఫ్ హీరో యష్‌పై రవితేజ దారుణంగా కామెంట్స్.. మాస్ మహారాజ్‌ను చీల్చి చెండుతున్న నెటిజన్లు!

మాస్ మహారాజ్ రవితేజ తొలిసారి పాన్ ఇండియా మూవీతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆలరించేందుకు రెడీ అయ్యారు. స్టూవర్ట్‌పురం అనే గ్రామానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు అనే దొంగ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిష్ఫు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రవితేజ ముంబై‌లో బిజీగా ఉన్నారు. అయితే ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. యష్‌పై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ముంబైలో మీడియాకు ఇంటర్వూ ఇస్తూ.. దక్షిణాది స్టార్ హీరోల గురించి రవితేజ తన అభిప్రాయాలను చెబుతూ.. రాంచరణ్ గొప్ప డ్యాన్సర్. అతడి డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని అన్నారు. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. డార్లింగ్.. అప్పీయరెన్స్ బాగుంటుంది అని అన్నారు. రాజమౌళి విజనరీ అని చెప్పాడు. విజయ్ కూడా మంచి డ్యాన్సర్. టెర్రిఫిక్ డ్యాన్సర్. నేను గొప్ప డ్యాన్సర్ కాదు. అలా మేనేజ్ చేస్తుంటాను అని రవితేజ చెప్పారు.

 Yash Fans and Netizens trolling heavily on Hero Raviteja over KGF is lucky movie for Rocky Bhai

ఇక కన్నడ స్టార్ యష్ గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ.. యష్ గురించి నాకు ఎక్కువగా తెలియదు. నేను అతడు నటించిన కేజీఎఫ్ సినిమాను మాత్రమే చూశాను. కేజీఎఫ్ లాంటి సినిమా అతడికి రావడం చాలా లక్కీ అంటూ రవితేజ అన్నాడు. దాంతో యష్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

యష్ తన 8 కెరీర్‌లో చాలా మంచి సినిమాలు చేశాడు. ఫ్లాఫ్‌లో ఉన్న ప్రశాంత్ నీల్‌ను యష్ ఎంపిక చేసుకొన్నాడు. కేజీఎఫ్ సినిమా స్క్రిప్టును యష్ సెలెక్ట్ చేసుకొన్నాడు. ఆ సినిమాను పాన్ ఇండియా వరకు తీసుకెళ్లింది యష్. డైలాగ్స్, మ్యూజిక్, ఇతర అంశాల్లో యష్ ఇన్వాల్వ్ అయ్యారు. యష్ ఒక్కడే దేశమంతా తిరిగి ప్రమోషన్ చేశాడు. అతడికి అన్ని రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయి అని నెటిజన్ కామెంట్ చేశాడు.

 Yash Fans and Netizens trolling heavily on Hero Raviteja over KGF is lucky movie for Rocky Bhai

యష్‌ను కించపరిచే విధంగా మాట్లాడటంపై రవితేజపై నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రవితేజ మీరంటే ఇప్పటి వరకు గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ గౌరవం పోయింది. నీ గురించి నీవు తెలుసుకొని ఎదుటి వారిపై కామెంట్స్ చేయండి. ఇలా ఒకరిపై నెగిటివ్ కామెంట్స్ చేయకు. కిక్ 2 సినిమా తర్వాత నీ కెరీర్ అతంత మాత్రంగా ఉందనే విషయం గ్రహించు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. యష్ యావరేజ్ మూవీ.. నీ కెరీర్‌లో బెస్ట్ మూవీ అంటూ కామెంట్ చేశారు.

రవితేజను మరో నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు. మీరంటే గౌరవం పోయింది. మీరు ఎవరి అండ లేకుండా సినిమా పరిశ్రమలో ఎదిగావు. కానీ మీరు ఆ విషయాన్ని గ్రహించకుండా మీ ఇగోను బయటపెట్టారు. ఉత్తర భారతంలో కేజీఎఫ్1 వసూలు చేసిన కలెక్షన్లను రాబట్టండి. అప్పుడు తెలుస్తుంది. ఎవరు లక్కీ.. ఎవరు అన్ లక్కీ అని కామెంట్ చేస్తున్నారు.

 Yash Fans and Netizens trolling heavily on Hero Raviteja over KGF is lucky movie for Rocky Bhai

కేజీఎఫ్‌కు ముందు కన్నడకు ఇండస్ట్రీ హిట్ యష్ ఇచ్చాడు. అత్యధిక విజయాలు సాధించిన హీరోగా రికార్డు ఉంది. ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే. ఒక సినిమా చేశాడు. అది కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కేజీఎఫ్‌కు ముందు హోంబలే బ్యానర్‌కు యూట్యూబ్‌లో 5 వేల మంది సబ్ స్క్రైబర్స్, ట్విట్టర్‌లో 500 మంది ఫాలోవర్స్ ఉండేవారు. రవితేజ ఇప్పుడు చెప్పు.. ఎవరు లక్కీ.. ఎవరు అన్ లక్కీ చెప్పు అంటూ రవితేజ‌పై ఒకరు విరుచుకుపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X