twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీస్టార్ల ఇళ్లపై ఐటీ రైడ్స్: కేజీఎఫ్ హీరో యష్ ఇంట్లో భారీగా బంగారం పట్టివేత, 30 కోట్ల అప్పు!

    |

    కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల నివాసాలపై శుక్రవారం మొదలైన ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ దాడులు శనివారం కూడా కొనసాగుతున్నాయి. నిర్మాతలు, స్టార్ హీరోల ఇళ్లలో కేజీల కొద్దీ బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    కన్నడ స్టార్స్ సుదీప్, శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, యష్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ ఇంట్లో దాదాపు 2 కేజీల బంగారం, 20 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    200 మంది సిబ్బందితో 25 టీమ్స్

    200 మంది సిబ్బందితో 25 టీమ్స్

    200 మంది సిబ్బందితో కూడిన మొత్తం 25 టీమ్స్ ఒకేసారి రంగంలోకి దిగి ఆయా స్టార్ల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రాక్ లైన్ వెంకటేష్‌తో పాటు కెజిఎఫ్ మూవీ ప్రొడ్యూసర్ కిరంగదురు విజయ్, సిఆర్ మనోహర్ నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు. స్టార్స్ సరిగా ఆదాయపన్ను చెల్లించడం లేదని, బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది..

    బ్రహ్మీ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్... బెస్ట్ కమెడియన్ ఎవరో మీరే తేల్చండి!బ్రహ్మీ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్... బెస్ట్ కమెడియన్ ఎవరో మీరే తేల్చండి!

    కెజిఎఫ్ హీరో యష్ ఇంట్లో భారీగా బంగారం, డబ్బు

    కెజిఎఫ్ హీరో యష్ ఇంట్లో భారీగా బంగారం, డబ్బు

    బెంగుళూరు బనాశంకరి ప్రాంతంలోని కత్రిగుప్పా ప్రాంతంలో నివాసం ఉంటున్న కెజిఎఫ్ హీరో యష్ ఇంటి నుంచి భారీ మొత్తంలో బంగారం, ప్లాటినమ్, వజ్రాలు స్వాధీనం చేసుకన్నట్లు సమాచారం. ముంబైలో ఉన్న యష్ ఐటీ అధికారుల రైట్స్ జరుగుతున్న విషయం తెలిసి వెంటనే బెంగుళూరు వచ్చేశారు. యష్ భార్య రాధిక పండిత్‌ను రహస్య ప్రదేశానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    యష్‌కు 30 కోట్ల అప్పు

    యష్‌కు 30 కోట్ల అప్పు

    బెంగుళూరు రేసుకోర్స్ రోడ్డులోని తేజ్‌వెస్ట్ ఎండ్ అనే స్టార్ హోటల్‌లో యష్ అద్దెకు తీసుకున్న గదితో పాటు.. కోసకెరిహల్లిలోని అతడి ఆఫీసులో కూడా సోదాలు నిర్వహించారు. అధికారులు మూడు సంచుల్లో బంగారం, డబ్బు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు అతడికి 8 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని, రెండు బ్యాంకుల్లో రూ.30 కోట్ల వరకు అప్పు ఉన్నట్లు గుర్తించారు.

    సుదీప్ షూటింగ్ నుంచి పిలిపించారు

    సుదీప్ షూటింగ్ నుంచి పిలిపించారు

    మరో స్టార్ కిచ్చా సుదీప్ తన సినిమా షూటింగులో భాగంగా మైసూరులో ఉండగా... అధికారులు అతడిని బెంగుళూరు పిలిపించారు. జేపీ నగర్లోని అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. వివిధ అంశాలపై అధికారులు అతడిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

    పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో కూడా...

    పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో కూడా...

    మరో కన్నడస్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు చెందిన సదాశివ నగర్లోని నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడి నుంచి భారీ మొత్తంలో బంగారం, కొన్ని విలువైన వస్తువలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Yesterday, the Income Tax raid on Sandalwood celebrities came as a shocker. Being one of the biggest raids ever conducted on actors and producers from the Kannada industry, several stars including Yash, Sudeep, Puneeth and Shivarajkumar were subjected to interrogation. Reports are making rounds that the IT officials are still present at KGF star Yash's residence looking into various documents. From the recent developments, we have learned that Yash has a whopping Rs 30 Crores of loan on him from the bank and also, Diamond, Platinum, gold and silver have been acquired at his residence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X