శుభలేఖపై 'కేజిఎఫ్ 2' డైలాగ్.. పిచ్చెక్కిస్తున్న రాఖీ భాయ్ క్రేజ్.. ఎక్కడా తగ్గట్లేదుగా!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు కన్నడ సినీ పరిశ్రమ అనేది ఒకటి ఉంటుందని తెలియని వారందరికీ ఆ సినిమా కన్నడ సినీ పరిశ్రమ సత్తా ఏమిటో చాటిచెప్పింది.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ తెరకెక్కిస్తామని అప్పట్లోనే ప్రకటించారు మేకర్స్. చెప్పినట్లుగానే కేజిఎఫ్ 2 పేరుతో ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేశారు. సినిమా విడుదలకు వారం పైగా అవుతున్నా ఇప్పటికీ సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తోంది.. ఈ సినిమాలో యష్ చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు చాలా ఫేమస్ అవడమే కాక ఏకంగా ఒక శుభలేఖలో కూడా అచ్చయింది అంటే అది ఎంత ఫేమస్ అయిందో దాని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఏమిటా డైలాగ్ అనే వివరాల్లోకి వెళితే..

సంచలన కలెక్షన్లు నమోదు
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలింస్ నిర్మించిన తాజా చిత్రం కేజిఎఫ్ 2. అద్భుతమైన విజయాన్ని సాధించిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోంది. కొంత మంది సినిమాలో కథ లేదు అని అంటున్నా సరే వరుస రికార్డులు బద్దలు కొడుతూ సంచలన కలెక్షన్లు నమోదు చేస్తూ ముందుకు వెళుతోంది.

రికార్డులు బద్దలు కొడుతూ
ఈ సినిమాలో అధీరా అనే విలన్ పాత్రలో సంజయ్ దత్ నటించగా ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రలో బాలీవుడ్ భామ రవీనాటాండన్ నటించింది. ఇక ఇతర కీలక పాత్రల్లో బాలకృష్ణ, రావు రమేష్, ప్రకాష్ రాజు వంటి వారు నటించారు. ఈ సినిమా మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందన తెచ్చుకోవడంతో వరుస రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

వైలెన్స్ వైలెన్స్ అంటూ
కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా మార్కెట్లో కూడా ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందు నుంచి ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ లో ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది. వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్ అంటూ హీరో ఎస్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

డైలాగ్ ను మార్చి
వైలెన్స్... వైలెన్స్...వైలెన్స్, ఐ డోంట్ లైక్! ఐ అవాయిడ్! బట్, వయలెన్స్ లైక్స్ మీ. సో ఐ కాంట్ అవాయిడ్!' అంటూ యష్ చెప్పుకొస్తాడు. ఇప్పుడు ఇదే సినిమా డైలాగ్ ను యష్ అభిమాని ఒకరు మార్చి తన పెళ్లి పత్రికలో వేసుకున్నాడు. 'మ్యారేజ్... మ్యారేజ్... మ్యారేజ్... ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవాయిడ్. బట్, మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్. ఐ కాంట్ అవాయిడ్'.

తప్పించుకోలేను
అంటే పెళ్లి... పెళ్లి... పెళ్లి... నాకు ఇష్టం లేదు. దాన్ని దూరం పెడుతున్నాను. కానీ, మా బంధువులకు నా పెళ్లి అంటే ఇష్టం. అందుకే తప్పించుకోలేను అంటూ ఆయన రాసుకొచ్చాడు. కర్ణాటకలోని బెల్గావికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు రాసుకున్న ఈ శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











