సలార్ కోసం రాబోతున్న రాఖీ భాయ్..ఆ రూట్లో ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ ప్రస్తుతం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో షూటింగ్ చివరి దశకి వచ్చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. ఇక ప్రభాస్ కూడా ప్రాజెక్ట్ కె మూవీ పూర్తి చేయాల్సి ఉంది. దాంతో పాటు మారుతి దర్శకత్వంలో చేస్తున్న హర్రర్ కామెడీ మూవీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఈ రెండు సినిమాల తర్వాత సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ చేస్తాడని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ సినిమా గురించి మరో ఆసక్తికరమైన టాక్ తెరపైకి వచ్చింది. సలార్ లో కేజీఎఫ్ సీక్వెల్ కి కొనసాగింపుగా రాఖీభాయ్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం నడుస్తుంది. సలార్ లో ప్రభాస్ క్యారెక్టర్ ని రాఖీభాయ్ యూరప్ లో కాలుస్తాడని తరువాత ఆరిద్దరూ కలిసి అండర్ వరల్డ్ మాఫియా సామ్రాజ్యంలో ఎలా తమ ఉనికిని చాటుకున్నారు.

ఇక ప్రపంచానికి తమ ఐడెంటిటిని ఎలా పరిచయం చేసుకున్నారు అనే అంశాలు ఇందులో ఉంటాయని టాక్. ఇక సలార్ ప్రభాస్ క్యారెక్టర్, రాఖీభాయ్ కలిసినపుడు భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని, వాటి తర్వాత పవర్ ఫుల్ ట్విస్ట్ తో వారిద్దరూ ఒకటి కావడం జరుగుతుంది అని కథ ప్రచారంలోకి వచ్చింది. ప్రశాంత్ నీల్ యూనివర్స్ ని వస్తున్న ఫ్రాంచైజ్ కథలలో భాగంగానే ఈ సలార్ మూవీ కూడా ప్రస్తుతం తెరకెక్కుతుంది. తరువాత ఎన్టీఆర్ మూవీ కూడా ఉండనుంది.
ఈ నేపధ్యంలో ఈ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కోసం ప్లాట్ ని ప్రశాంత్ నీల్ సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్. సలార్ మూవీ ఎండ్ లో రాఖీభాయ్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుందట. ఈ నేపధ్యంలో సలార్ మూవీ షూటింగ్ కోసం కీలక సన్నివేశాలని ఇప్పుడే ప్రశాంత్ తెరకెక్కిస్తున్నాడంట. ఆ షూటింగ్ లో రాకింగ్ స్టార్ యష్ కూడా త్వరలో పాల్గొంటాడు అని ప్రచారంలో ఉంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలియాలి.


Click it and Unblock the Notifications











