Year Ender 2023: ఈ ఏడాది ఇండియాలో టాప్ 10 హీరోలు వీళ్లే.. ప్రభాస్‌ను వెనక్కి నెట్టిన షారుఖ్!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారలపై సర్వే నిర్వహిస్తుండటం తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి గాను 2023లో ఇండియాలో టాప్ 10 హీరోల జాబితాను రిలీజ్ చేసింది. దేశంలో ఎవరు ఎక్కువ ఆదరణ పొందుతున్నారనే దానిపై సోషల్ మీడియా, ఆన్ లైన్ ఆధారంగా ఈ సర్వేను నిర్వహించి... టాప్ 10 హీరోల జాబితాను విడుదల చేసింది. ఇండియా వైడ్ గా టాప్ 4లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. ఇక టాప్ 1 స్థానంలో ఎవరు ఉన్నారు.. అందులో మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ ఏడాది 2023 ఇండియాలో టాప్ 1 హీరో ఎవరు అంటే... ఎవరి హీరో అభిమానులు.. వాళ్ల హీరో పేరు చెప్పుకుంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరోనే గొప్ప అని చెప్పుకుంటూ వస్తారు. అయితే నిజానికి ఇలాంటి ప్రశ్నకు ఎవరు కరెక్టుగా చెప్పలేరు కానీ... ఏ హీరోకు ఉండే ప్రముఖ్యత ఆ హీరోకు ఉంటుంది. అయితే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారాలపై సర్వే నిర్వహిస్తునే విషయం తెలిసిందే. తాజాగా 2023 ఇండియాలో టాప్ 10 హీరోలపై సర్వే నిర్వహించింది. అందులో టాప్ 10 హీరోల జాబితాను ఆర్మాక్స్ సోషల్ మీడియా ఖాతా వేదికగా షేర్ చేసింది.

2023 పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 10 హీరోల్లో నంబర్ 1 గా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నిలిచాడు. ఈ హీరో ఈ ఏడాది ఇప్పటికే పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఈ సినిమాలతో కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇక తాజాగా రాజ్ కుమార్ హీరాణి దర్శకత్వంలో డంకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 21న హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకుకూడా పాజిటివ్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

ఇక టాప్ 2లో తమిళ హీరో విజయ్ నిలిచాడు. ఈ హీరో ఇటీవల లియో చిత్రంతో వచ్చి సూపర్ హిట్టను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిలిచాడు. ఈ హీరో ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా... బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేదు. ఇక టాప్ 4లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ ఈ ఏడాది ఆది పురుష్ చిత్రంతో అలరించాడు. అయితే ఈ సినిమాపై పలు విమర్శలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద అనకున్న స్థాయిలో ఆడలేదు.
ఇక తాజాగా ప్రభాస్ సలార్ చిత్రంతో వచ్చి.. దూసుకుపోతున్నాడు. సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరోసారి పెరగనుందని తెలుస్తోంది. ఇక టాప్ 5లో అక్షయ్ కుమార్ నిలవగా.. టాప్ 6లో కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ నిలిచారు. ఇక టాప్ 7లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఉండగా.. ఈ హీరో ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ పాన్ వరల్డ్ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక టాప్ 8లో మన తెలుగు హీరో మహేశ్ బాబు నిలవగా.. ఈ హీరో ప్రస్తుతం గుంటూరుకారం సినిమాలో నటిస్తున్నాడు. ఇక టాప్ 9లో అల్లు అర్జున్ ఉండగా.. ఈ హీరో పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక టాప్ 10లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇవండి ఇండియాలో 2023 టాప్ 10 హీరోస్ లిస్ట్.


Click it and Unblock the Notifications











