twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరు ఎగ్జిట్ అయితే మంచిది: ఫేక్ అంటూ ఎగ్జిట్ పోల్స్ మీద హీరో ఆగ్రహం

    |

    2019లో జరిగే సాధారణ ఎన్నికలకు అతిపెద్ద సెమీఫైనల్‌గా చెప్పబడుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. పోలింగ్ ముగిసిన అనంతరం జాతీయు మీడియా సంస్థలు ఎగ్జిపోల్స్ సర్వేలు విడుదల చేయగా.... తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో బిజేపీ అధికారంలో వస్తుందని ఆయా సర్వేలు వెల్లడించాయి.

    అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు భిన్నమైన తీర్పు ఓటర్ల నుంచి వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ... రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తలక్రిందులయ్యాయి. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

    ఫేక్ న్యూస్ అంటూ

    ఓ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రస్తావిస్తూ... ఇక మీరు ఎగ్జిట్ అయితే మంచిది అని వ్యాఖ్యానించారు. అలాంటి తప్పుడు సర్వేలు విడుదల చేసిన సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫేక్ న్యూస్ అంటూ ఫైర్ అయ్యారు.

    సిద్ధార్థ్ ముక్కుసూటి తత్వం

    సిద్ధార్థ్ ముక్కుసూటి తత్వం

    ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా మాట్లాడే సిద్ధార్థ్ గతంలోనూ కొన్ని అంశాలపై తన మనసులోని భావాన్ని నిర్మొహమాటంగా మాట్లాడి వివాదాల్లో ఇరుక్కోవడం, నెటిజన్ల చేతిలో ట్రోలింగుకు గురైన సంగతి తెలిసిందే.

    ముందు నుంచీ వ్యతిరేకమే

    ముందు నుంచీ వ్యతిరేకమే

    హీరో సిద్ధార్థ్ ముందు నుంచీ బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని సంఘటనలు, తీసుకున్న నిర్ణయాలపై ఆగ్రహంగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీకి అనుకూలంగా రావడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన ఎన్నికల ఫలితాల అనంతరం తనదైనశైలిలో స్పందించారు.

    సైతాన్ కా బచ్చా

    సైతాన్ కా బచ్చా

    అయితే తమిళనాడుకు చెందిన సిద్ధార్థ్ తెలంగాణలో టీఆర్ఎస్ విజయంపై స్పందించలేదు. కాగా.. ఆయన ప్రస్తుతం తమిళంలో సైతాన్ కా బచ్చా అనే చిత్రంలో నటిస్తున్నారు.

    English summary
    "You should exit polls from here on. Forever. #FekuNews." Actor Siddharth tweet on Postcard Exit Polls.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X