బాలకృష్ణతో మల్టీ స్టారర్ సినిమాకు నో చెప్పిన విశ్వక్ సేన్.. తొలిసారి రీజన్ రివీల్!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అద్భుతైన సినిమాలతో వస్తూ అందరినీ మెప్పిస్తున్న ఈయన ఈ సారి ఎవరూ ఊహించని కాన్సెప్ట్ లో వస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా మనుషులను కూడా తాకకుండా ఉండే ఓ విచిత్రమైన జబ్బుతో.. అఘోర పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇంటర్వ్యూ ఇచ్చిన ఈయన.. తన అభిమాన హీరో బాలయ్య బాబుతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే నో చెప్పాల్సి వచ్చిందని చెప్పాడు. అయితే అందుకు గల కారణాలు ఏంటో తొలి సారి రివీల్ చేశారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Young and Dinamic Hero Vishwak Sen Said No To Balakrishna Combo Film Check Details

విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న తాజా చిత్రమే గామి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్ లు విడుదల కాగా విపరీతమైన అంచనాలను పెంచేశాయి. ఇటీవలే విడుదల అయిన ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ట్రైలర్ తో మరింత బజ్ పెంచేసిన ఈ సినిమాను యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మిస్తున్నారు.

నరేష్ కుమరాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా కనిపించబోతుంది. వీరు మాత్రమే కాకుండా అభినయ, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు నటిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఈయన తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడే షాకింగ్ కామెంట్లు చేశారు.

ముఖ్యంగా సినిమా కోసం తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా.. చాలా కష్టపడి పని చేశానని చెప్పాడు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం తనకు ఉందని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి సినిమా చేయాల్సిన అవకాశం వస్తే ఎందుకు నో చెప్పారని యాంకర్ అడగ్గా.. ముందుగా ఏం మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత తాను ఆ అవకాశాన్ని వదులుకోలేదని.. వదులుకోవాల్సి వచ్చిందని వివరించాడు.

Young and Dinamic Hero Vishwak Sen Said No To Balakrishna Combo Film Check Details

బాలకృష్ణతో చేయాల్సిన సినిమా కథ విన్నప్పుడు.. అంతకంటే మంచి సినిమాలో, పాత్రలో తాను బాలయ్యతో చేయాలని ఉందని.. తన ఫేవరెట్ హీరోతో తాను చేసే సినిమా ఓ రేంజ్ లో ఉండాలని భావిస్తున్నట్లు కూడా వెల్లడించాడు. అంటే ఈ కథ బాలేదా అంటూ యాంకర్ అడగ్గా.. అలా కాదు.. ఈ కథ బాగుంది కానీ నేను అంతకు మించి ఎక్స్ పెక్ట్ చేస్తున్నానంటూ సమాధానం చెప్పాడు విశ్వక్ సేన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X