విశ్వక్ సేన్ షాకింగ్​ రెమ్యునరేషన్ - గామిలో అఘోరగా కనిపించేందుకు ఎంత వసూలు చేశాడంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి విభిన్నమైన సినిమాలతో వస్తూ ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుటున్న ఈయన ఈ సారి మరో అడుగు ముందుకు వేసి అఘోరాగా కనిపించబోతున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో మనుషనులను తాకకుండా ఉండే ఓ విచిత్రమైన జబ్బుతో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో అఘోరగా కనిపించేందుకు విశ్వక్ సేన్.. ఎంత పుచ్చుకున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఈ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న సినిమానే "గామి". అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా విశ్వక్ సేన్ సరసన చాందినీ చౌదరి కనిపించబోతుంది. అంతేకాకుండా అభినయ, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నటిస్తున్నారు. యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నరేష్ కుమరాన్ సంగీతం అందిస్తున్నాడు.

Young And Dynamic Hero Vishwak Sen Shocking Remuneration For Gaami Movie Check Details

ఇప్పటికీ ఈ సినిమాకు పోస్టర్, టీజర్, ట్రైలర్ లు విడుదల కాగా... విపరీతమైన అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్ విభిన్నమైన పాత్రలో కనిపించడం.. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తుండడంతో అంతా సినిమాను చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 8వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తూ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మూవీ టీం వాళ్లు.

ముఖ్యంగా హీరోహీరోయిన్లతో పాటు దర్శక, నిర్మాతలు కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్ సేన్ సినిమా చాలా బాగుంటుందని.. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని చెప్పారు. అలాగే తన రెమ్యునరేషన్ కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఆయనకు ఎదురు కాగా... అసలు విషయం చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎంత త్యాగం చేశారో వివరించారు.

Young And Dynamic Hero Vishwak Sen Shocking Remuneration For Gaami Movie Check Details

విశ్వక్ సేన్ గామి సినిమాలో అఘోరగా కనిపించడానికి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. సినిమా తనకు మంచి పేరు తీసుకు వస్తుందనే నమ్మకంతోనే.. డబ్బుల కోసం కాకుండా తన కెరియర్ కోసం పని చేసినట్లు వివరించారు. అలాగే సినిమాలు తన జీవన శైలిపై ఎలాంటి మార్పు చూపించలేవని.. 2018 నుంచి ఇప్పటి వరకు తాను స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మార్చి 8వ తేదీన అంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X