బెల్లంకొండ శ్రీనివాస్‌పై ట్రోలింగ్.. థాయిలాండ్ షూటింగ్‌లో చేసిన పని!
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస చిత్రాలలో నటిస్తున్నాడు. కానీ ఈ హీరోకి సరైన విజయం మాత్రం దక్కడం లేదు. హిట్ మూవీ కోసం చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సాక్ష్యం చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సీనియర్ దర్శకుడు తేజ దర్శత్వంలో నటిస్తున్నాయి. ఈ చిత్ర టైటిల్ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ పై తాజా సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగుతున్నాయి.

షూటింగ్‌లో బిజీగా
బెల్లంకొండ శ్రీనివాస్, తేజ చిత్ర షూటింగ్ థాయిలాండ్ లో బిజీగా జరుగుతోంది. షూటింగ్ మధ్యలో ఆటవిడుపుగా శ్రీనివాస్ అక్కడి జంతువులతో సరదాగా గడిపాడు. బెల్లంకొండ శ్రీనివాస్ థాయిలాండ్ లోని ఏనుగులతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
vote for your favourite bigg boss contestant here

మంచిపని కాదు
ఏనుగు దంతాలపై బెల్లం కొండా శ్రీనివాస్ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు. శ్రీనివాస్ చేసిన ఈ పనిని కొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మూగజీవాలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం వాటిని హింసించడమే అని అంటున్నారు.

జంతుప్రేమికుల మండిపాటు
ఏనుగుదంతాలపై కూర్చుని విహరించడమే కాక ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇతని జంతుప్రేమికులు బెల్లంకొండ శ్రీనివాస్ పై మండిపడుతున్నారు. మూగజీవాల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచిస్తున్నారు.

తేజపైనే ఆశలు
ఇక సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంతో అయినా మంచి విజయం అందుకోవాలని బెల్లంకొండ శ్రీనివాస్ భావిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి చిత్రం తరువాత తేజ దర్శత్వం వహిస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రంలో శ్రీనివాస్ కు జోడిగా హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











