ఆంజనేయ స్వామి భక్తుడిగా మారిపోయిన నితిన్!
యంగ్ హీరో నితిన్ త్వరలో భీష్మ చిత్రంతో నటించబోతున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. గత ఏడాది నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశ పరిచాయి. దీనితో తిరిగి పుంజుకోవాలని నితిన్ భావిస్తున్నాడు. కాగా నితిన్ తాజాగా ఆంజనేయస్వామి భక్తుడిగా మారిపోయాడు. నితిన్ ట్విటర్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
కాషాయం వస్త్రాలు, ఆంజనేయస్వామి మాల ధరించిన ఉన్న ఫోటోని నితిన్ పోస్ట్ చేశాడు. ముఖం మాత్రం చూపించలేదు. ఆంజనేయస్వామి దీక్షలో ఉండడం ఆయన ఆశీర్వాదంగా భావిస్తున్నా. చాలా ప్రశాంతంగా ఉంది. ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి అంజనేయస్వామి భక్తి పాటలతో రోజుని ప్రారంభిస్తున్నా. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి అని నితిన్ ట్వీట్ చేశాడు. ఈ దీక్ష ఎన్నిరోజులో తెలియదు కానీ ప్రస్తుతం నితిన్ పూర్తిగా భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నాడు.

ఆంజనేయస్వామి నేపథ్యంలో తెరకెక్కిన శ్రీఆంజనేయం చిత్రంలో నితిన్ నటించిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల చిత్రానికి సంబంధించిన ప్రీప్రోడుక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











