ఆసక్తికరంగా నితిన్ 'భీష్మ' ప్రీ లుక్!
యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాదిలో మాత్రం తన చిత్రాల విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అదే విధంగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో కూడా నితిన్ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. శనివారం నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా భీష్మ చిత్ర యూనిట్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది. భీష్మ చిత్ర ప్రీ లుక్, టైటిల్ లోగో విడుదల చేశారు. ప్రీ లుక్ ని చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారు.

మహాభారతంలో భీష్ముడి గురించి అందరూ వినే ఉంటారు. అతడు ఆజన్మ బ్రహ్మచారి. నితిన్ భీష్మ చిత్రానికి సింగిల్ ఫారెవర్ అనే క్యాప్షన్ కూడా ఉంది. కానీ ప్రీ లుక్ లో మాత్రం నితిన్ చుట్టూ అమ్మాయిల దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలియాలంటే బీష్మ చిత్రం విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











