మరోసారి ప్రభాస్ టీమ్‌‌తో శర్వానంద్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

యంగ్ హీరో శర్వానంద్ గత కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో కాస్త ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ సినిమాలు చేసినప్పటికీ ఊహించని అపజయాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మహానుభావుడు సక్సెస్ తరువాత శర్వానంద్ ఇంతవరకు సక్సెస్ చూసింది లేదు. ఆ తరువాత హ్యాట్రిక్ డిజాస్టర్స్ మనోడికి కాస్త డిప్రెషన్ లోకి నెట్టేశాయి.

ఆ ప్లాప్స్ వల్ల శర్వా చాలా బాధకు లోనైట్లు టాక్ వచ్చింది. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను వంటి సినిమాలు రిలీజ్ కి ముందు ఆడియెన్స్ లో మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. జాను తప్పితే మిగతా రెండు సినిమాలు శర్వానంద్ మార్కెట్ కి మించిన బడ్జెట్ తో రూపొందించారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో శర్వానంద్ అసహనానికి లోనయ్యాడట. నెక్స్ట్ కూడా శర్వానంద్ కాస్త ప్రయోగాత్మక సినిమాలతోనే రాబోతున్నాడు.

Young hero sharwanand new project with prabhas uv creations

ఇకపోతే ఇలాంటి సమయంలో మంచి కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ తో మళ్ళీ బాక్సాఫీస్ వద్ద త తన ట్రాక్ సెట్ చేసుకోవాలని ప్రభాస్ టీమ్ తో కలిసినట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు శ్రీ రామ్ ద్వారా యూవీ క్రియేషన్స్ నిర్మించబోయే సినిమాలో శర్వానంద్ కథానాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ లో ఇదివరకే శర్వా రన్ రాజా రన్ - ఎక్స్ ప్రెస్ రాజా - మహానుభావుడు వంటి హిట్ సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమా చేసి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X