పెళ్లి పీటలెక్కబోతున్న యువ హీరో... ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ చూశారా?

హీరో త్రిగన్... ఈ పేరు అంతగా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ కథ, గరుడ వేగ, డబ్యూ డబ్యూ డబ్యూ, డీయర్ మేఘ చిత్రాల్లో నటించిన హీరో అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ యువ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రేపు అనగా సెప్టెంబరు 3వ తేదీన పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇక ఈరోజు ఆయన కాబోయే భార్యతో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ దిగారు. అవి వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే....

జెనిలియా నటించిన కథ సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు త్రిగన్. క్యూట్ లుక్స్ తో స్మైలీ ఫేస్ తో ఆకట్టుకుంటునే త్రిగన్... ఎందుకో కానీ సాలిడ్ హిట్ పడటం లేదు. ఆయనకు మంచి అందం, దానితో పాటు యాక్టింగ్ స్కిల్స్ అన్నీ ఉన్నా... ఎందుకో స్టార్ హీరో కాలేకపోయాడు. కొంచెం హీరో రామ్ ను పోలీ ఉండే ఈ హీరో.. చాలా సినిమాల్లో నటించాడు.

Young Hero Trigun is getting married on September 3 And His pre-wedding photos Viral

త్రిగుణ్... రాజశేఖర్ తో కలిసి పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డీయర్ మేఘ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతోనూ ఈ హీరో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఇటీవల ప్రేమదేశం సినిమాతో కూడా అలరించాడు.

Young Hero Trigun is getting married on September 3 And His pre-wedding photos Viral

ప్రస్తుతం ఈ కుర్ర హీరో త్రిగుణ్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సెప్టెంబర్ 3వ తేదీన పెళ్లికి ముస్తాబు అవుతున్నాడు ఈ హీరో. నివేదిత అనే అమ్మాయితో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుంటున్నాడు ఈ హీరో. ఇక కుటుంబం, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరుపుకోనున్నాడు ఈ హీరో. శనివారం సాయంత్రం ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరిగింది.

Young Hero Trigun is getting married on September 3 And His pre-wedding photos Viral

ఆదివారం ఈ కుర్ర హీరో పెళ్లీ పీటలెక్కనున్నాడు. శ్రీ సెంతుర్ మహల్, అవినాశి, తిరుపుర్, తమిళనాడులో వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు సినిమా పరిశ్రమ ప్రముఖులు, రాజకీయా నాయకులు చాలా మంది సెలబ్రెటీలు హాజరు కానున్నారు. అరుణ్ అదిత్ గా తెలుగు, తమిళ్ లో కొన్ని సినిమాలు తీసిన ఈయన.... తరువాత 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకున్నారు.

Young Hero Trigun is getting married on September 3 And His pre-wedding photos Viral

ఇక ఆయన ఈరోజు తన కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అవి చూసిన నెటిజన్స్... విషెష్ చెబుతున్నారు. అంతే కాదు జంట బాగుందని కామెంట్స్ పెడుతున్నారు. త్రిగుణ్.. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X