ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలో యంగ్ బ్యూటీస్.. ఒకరికి 18, మరొకరికి 20

జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే తదుపరి పాన్ ఇండియా సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30 ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇదివరకే తుది దశకు చేరుకున్నాయి. ఇక వీలైనంత త్వరగా దర్శకుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇక దర్శకుడు మాత్రం ఇంకా ఒక్క విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక హీరోయిన్ విషయంలో ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇంతకుముందే ఆలియా భట్ ఫిక్స్ అయినట్లుగా టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆమె ఇతర కమిట్మెంట్స్ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడంతో ప్రాజెక్టును క్యాన్సిల్ చేసినట్లుగా మరొక టాక్ వినిపించింది.

Young heroines for Jr ntr upcoming pan india project with koratala siva

అలాగే కీయరా అద్వానీ, పరిణితి చోప్రా ఇలా చాలామంది పేర్లు వినిపించాయి కానీ కొరటాల ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కృతి శెట్టి నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే మరొక ముఖ్యమైన పాత్ర కోసం పెళ్లి సందD బ్యూటీ శ్రీ లీల నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పదిహేడేళ్ల వయసులోనే హీరోయిన్ గా ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టి ప్రస్తుతం అగ్ర హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. ఈ బ్యూటీకి ప్రస్తుతం 18 ఏళ్ల వయసు మాత్రమేమ్ అలాగే మరొకవైపు 20 ఏళ్ల శ్రీలీల పెళ్లి సందD సక్సెస్ అనంతరం పెద్ద హీరోలతో నటించే ఛాన్స్ కూడా అందుకుంటోంది. ఇటీవల కొరటాల శివ కూడా ఆమె పేరును ప్రస్తావించినట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X