కరోనాను ఎదురించి ఎన్టీఆర్ షూటింగ్.. రాజమౌళిని ఒప్పించి తప్పనిపరిస్థితుల్లో..
తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్‌లో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అగ్రహీరోలందరూ ఇంటికే పరిమితమయ్యారు. గత మూడు నెలలుగా ఎలాంటి పనిలేకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా కోవిడ్ 19 పరిస్థితులను ఎదురించి ఎన్టీఆర్ షూటింగుకు హాజరు కావడం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం రిస్క్‌ను పక్కన పెట్టి ఓ కూల్ డ్రింక్ యాడ్ షూటింగు యాడ్‌ను ఎన్టీఆర్ పూర్తి చేయడం వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే..

చాలా రోజులుగా భీమ్ గెటప్‌లో
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న RRR మూవీలో కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. అయితే గెటప్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండటంతో ఆ గెటప్‌ను సీక్రెట్‌గా ఉంచుతున్నారు. అయితే RRR మూవీ చిత్రం షూటింగ్ కరోనావైరస్ కారణంగా వాయిదా పడటంతో ఆ భీమ్ గెటప్‌ను ఎక్కువ కాలం కొనసాగించాల్సి వచ్చింది.

RRR ట్రయల్ షూట్ క్యాన్సిల్
తాజాగా లాక్‌డౌన్ సడలింపుల తర్వాత దర్శకుడు రాజమౌళి RRR సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఓ ట్రయల్ షూట్‌కు సిద్ధమయ్యారు. అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కరోనావ్యాప్తి పెరిగిపోవడంతో షూటింగును కూడా క్యాన్సిల్ చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ముందస్తుగా ఒప్పుకొన్న యాడ్ షూటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే యాడ్‌లో అదే గెటప్‌తో కనిపించడానికి రాజమౌళి అనుమతి తీసుకొన్నట్టు తెలిసింది.

కూల్ డ్రింక్ కంపెనీ యాడ్ షూటింగులో
గత కొద్ది సంవత్సరాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ శీతల పానీయం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టులో భాగంగా మార్చి నెలలో ఎన్టీఆర్ కూల్ డ్రింక్ కంపెనీ కోసం వ్యాపార ప్రకటనలో నటించాల్సింది. కానీ కోవిడ్ 19 పరిస్థితుల కారణంగా అన్ని షూటింగులకు దూరం ఉన్నారు. అయితే తెలుగు బిగ్‌బాస్ షోకు సదరు కూల్ డ్రింక్ కంపెనీ ప్రధాన స్పాన్సర్ కావడంతో తప్పనిసరిగా యాడ్‌ను షూట్ చేయాల్సి వచ్చిందనే వార్త మీడియాలో ప్రచారమైంది.

క్షేమంగా ఉండాలని ఆకాంక్ష
తాజాగా శీతల యాడ్‌కు సంబంధించిన చిన్న ప్రకటనలో కనిపించారు. సదరు కంపెనీకి సంబంధించిన డ్రింక్ తాగుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ కుటుంబంతో క్షేమంగా ఉండాలని కోరుకొంటున్నాను. ఈ కంపెనీ నిర్వహించిన పోటీకి ఎంపికైనందుకు ధన్యవాదాలు అంటూ ఎన్టీఆర్ యాడ్‌లో నటించారు. సదరు కూల్ డ్రింక్ గురించి గొప్పగా చెబుతూ ఆయన కనిపించారు.
Recommended Video

గెటప్ బయటపడకుండా జాగ్రత్త
అయితే భీమ్ పాత్రకు సంబంధించిన గెటప్‌ను బయటకు తెలియకుండా జాగ్రత్తలు పడ్డారు. తలపై క్యాప్ పెట్టుకొని జుట్టును కనిపించకుండా చేశారు. అయితే తన గుబురు మీసాలను మాత్రం ఎన్టీఆర్ బయటపెట్టేశారు. RRR షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో ఇలా ప్రొఫెషనల్‌గా ఎన్టీఆర్ యాడ్ షూటింగులో నటించి అభిమానులకు చేరవయ్యారు. త్వరలోనే ఈ కొత్త యాడ్ బుల్లితెరపైన ప్రత్యక్షం కానున్నది.


Click it and Unblock the Notifications











