మరీ ఇంత నీచమా? షర్మిల ఇష్యూపై... ప్రభాస్ అభిమానుల్లోనూ ఆవేదన!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... టాలీవుడ్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నటుడు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. తన పనేదో తాను చేసుకుంటూ ఇండస్ట్రీలో అందరితోనూ సంత్సబంధాలు కొనసాగిస్తూ తన సినిమా కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్న స్టార్.
ప్రభాస్ ముందు నుంచీ రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉంటూ వస్తున్నారు. సినిమాలు, అభిమానులు, స్నేహితులు... ఇదే యంగ్ రెబల్ స్టార్ ప్రపంచం. అయితే తాజాగా ప్రభాస్ పేరు మీడియాలో మారు మ్రోగిపోతుండటం, అంది కూడా ఓ ఆడకూతురుకు లింకు పెట్టి కొందరు రాక్షసానందం పొందుతున్నారనే విషయం తెలిసి అభిమానులు షాకయ్యారు.

ఫిర్యాదు చేసిన షర్మిల
కొందరు రాజకీయ లబ్ది కోసం తన క్యారెక్టర్ మీద నిందలు వేస్తూ ప్రభాస్‌తో లింకు పెట్టి దుష్ర్పచారం చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇటు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

ఇంతకంటే నీచం ఉండదు
రాజకీయ లబ్ది కోసం ఒక ఆడకూతురు క్యారెక్టర్ మీద దారుణమైన నిందలు వేయడం, ప్రభాస్ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నటుడిని ఇందుకు పావుగా వాడు కోవడం.... ఇంతకంటే నీచం ఉండదని, ఇలాంటి ప్రచారం చేస్తున్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతోంది.

సోషల్ మీడియాలో
సోషల్ మీడియాలో షర్మిల, ప్రభాస్ గురించి నీచమైన కామెంట్స్ చేయడం, వారికి లింక్ పెడుతూ దుష్ప్రచారం చేయడం ఎవరైనా చేస్తే వాటిని హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు కొందరు ఫ్యాన్స్ సైతం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ వరకు వెళ్లిన మ్యాటర్
ప్రస్తుతం ‘సాహో' మూవీ షూటింగులో ప్రభాస్ దృష్టికి షర్మిల ఇష్యూ వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై యంగ్ రెబల్ స్టార్ స్పందించే అవకాశం ఉంది. బహుషా తన సోషల్ మీడియా పేజీ ద్వారా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

షూటింగులో బిజీ బీజీ
ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో' మూవీతో పాటు, రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా గడుపుతున్నారు. ‘సాహో' చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











