13 years of Samantha in Tollywood ఖుషి షూటింగ్‌లో మైత్రీ సంబరాలు..విజయ్ దేవరకొండతో కలిసి..
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు చాలా నెలల తర్వాత తెలుగు సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు. గత కొద్ది నెలల క్రితం ఆమె కండరాల వ్యాధి మయోసిటిస్ తో బాధపడుతూ తాత్కాలికంగా షూటింగులకు దూరంగా ఉంటూ వచ్చారు. మయోసిటిస్ వ్యాధి నుంచి కోలుకొన్న తర్వాత ఇటీవల సిటడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగుకు హాజరయ్యారు. అయితే తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషీ చిత్ర షూటింగ్‌కు హాజరయ్యారు. ఈ సినిమా షూటింగ్‌కు హాజరైన సమంతకు మైత్రీ మూవీ మేకర్స్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ వివరాల్లోకి వెళితే..

మహిళా దినోత్సవం రోజున షూటింగుకు వచ్చిన సమంతను సాదరంగా మైత్రీ మూవీ మేకర్స్ ఘన స్వాగతం పలికారు. మహిళా దినోత్సవం వేడుకలను సెట్లో సమంత చేతులు మీదుగా జరిపించారు. అంతేకాకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి సమంత అడుగుపెట్టి 13 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఖుషీ సినిమా సెట్లోకి అడుగుపెట్టిన సమంతకు విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు రవి శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. సమంత రావడంతో యూనిట్ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు.
ఇదిలా ఉండగా, ప్రేమ కథా చిత్రంగా రూపొందుతున్న ఖుషీ సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేందుకు మైత్రీ ప్లాన్ చేసింది. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications











