రెండేళ్ల తర్వాత 'కల్కి' సీక్రెట్ రివీల్.. ‘బుజ్జి' క్యారెక్టర్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ' విడుదలై రెండేళ్లు పూర్తయ్యాయి. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఇండియన్ సినిమా హిస్టరీలో నయా రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ కీలకమైన భైరవ అనే పాత్ర పోషించగా, అతని దగ్గర ఉంటే ఏఐ వాహనం 'బుజ్జి'.ఇది కేవలం వాహనం మాత్రమే కాదు.. కథలో కీలక పాత్ర పోషించింది. బుజ్జి తన సరదా డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆ పాత్ర వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉందని తాజాగా జాతీయ అవార్డు గ్రహీత, హీరోయిన్ కీర్తి సురేష్ వెల్లడించారు. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటీ?

మొదట బుజ్జి కాదు.. మరో పాత్ర ఆఫర్
దర్శకుడు నాగ్ అశ్విన్‌తో 'మహానటి' వంటి క్లాసిక్ సినిమా చేసిన కీర్తి సురేష్‌కు 'కల్కి 2898 ఏడీ'లో కూడా మొదట ఓ ఆన్-స్క్రీన్ పాత్రను ఆఫర్ చేశారట. అయితే ఆ పాత్రపై తనకు పూర్తి నమ్మకం కలగకపోవడంతో దాన్ని అంగీకరించలేదని ఆమె తెలిపారు. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల్లో పాత్రను తిరస్కరించడం చాలా అరుదు. కానీ కథ, పాత్రపై తనకు నమ్మకం ఉండాలని భావించే కీర్తి, అదే కారణంతో మొదటి ఆఫర్‌కు 'నో' చెప్పారని వెల్లడించారు.

2 Years Later Kalki Secret Out Keerthy Suresh Rejected One Role Before Becoming Bujji

ఆ పాత్రను తిరస్కరించిన తర్వాత కూడా నాగ్ అశ్విన్ మాత్రం కీర్తిని ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలనే నిర్ణయంతో ఉన్నారు. ఒకరోజు ఆమెకు మెసేజ్ చేస్తూ.. "నా సినిమాలో కనీసం గోడ చాటు నుంచి అయినా తొంగి చూస్తావా?" అని సరదాగా అడిగారట. ఆ తర్వాత ఫోన్ చేసి, "నాకు నీ నటన కాదు.. నీ గొంతు కావాలి" అని అడిగారని కీర్తి గుర్తు చేసుకున్నారు. అయితే.. నాగ్ ఆశ్విన్ ఏం మాట్లాడుతున్నాడో తనకు మొదట అర్థం కాలేదట. దీంతో 'అంటే షూటింగ్‌కు రావాల్సిన అవసరం లేదా?' అని అడిగితే, 'లేదు.. నువ్వు కేవలం ఏఐ పాత్రకు వాయిస్ ఇవ్వాలి' అని నాగ్ అశ్విన్ చెప్పారట. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంగీకరించానని చెప్పారు కీర్తి.

'బుజ్జి'గా కీర్తి గొంతు.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణ
సినిమాలో కీర్తి సురేష్ ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించకపోయినా, ఆమె స్వరం మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. భైరవ, బుజ్జి మధ్య జరిగే సరదా సంభాషణలు, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా బుజ్జి మాట్లాడే ప్రతి డైలాగ్‌కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్‌లో 'ఐరన్ మ్యాన్'కు జార్విస్ ఎలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందో, 'కల్కి 2898 ఏడీ'లో బుజ్జి కూడా అలాంటి గుర్తింపే సంపాదించింది. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఒక వాహనం ప్రేక్షకులు భావోద్వేగంగా కనెక్ట్ కావడానికి కీర్తి సురేష్ వాయిస్ అందించారట.

కీర్తి సురేష్ ఇంకా మాట్లాడుతూ.. 'నేను మొదట ఆ పాత్రకు ఒప్పుకుని ఉంటే, బుజ్జి చేసే అవకాశం వచ్చేదే కాదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మొదటి పాత్రను తిరస్కరించడం సరైన నిర్ణయమే అనిపిస్తోంది' అని కీర్తి చెప్పింది. కీర్తి తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం వంటి భాషల్లో కూడా బుజ్జి పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ప్రతి భాష ప్రేక్షకులకు తగ్గట్టుగా తన గొంతులో చిన్నచిన్న మార్పులు చేస్తూ పాత్రకు మరింత జీవం పోశారు. అందుకే బుజ్జి పాత్ర అన్ని భాషల్లోనూ ఒకే స్థాయిలో ఆదరణ పొందింది.

నాగ్ అశ్విన్ విజన్‌
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో ప్రముఖ నటీమణులను తెరపై చూపించాలనే ఆలోచన ఉంటుంది. కానీ నాగ్ అశ్విన్ మాత్రం కీర్తి సురేష్‌ను తెరపై కాకుండా, కేవలం గొంతు ద్వారానే పాత్రను నిలబెట్టాలని నిర్ణయించుకోవడం ఆయన విజన్ కు ఇదోక నిదర్శనమనే చెప్పాలి. అదే నిర్ణయం చివరికి సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. మొత్తానికి ఈ సీక్రెట్ రెండు సంవత్సరాల తరువాత బయటపడింది. ఇక కల్కి 2లో ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కీర్తి సురేష్ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సత్యవాన్ సావిత్రి, రాఫ్తార్, అక్క, రౌడీ జనార్దన్ తో పాటు విక్టరీ వెంకటేష్‌ - కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X