హీరోలకంటే తక్కువేమి కాదు.. 2020ట్విట్టర్ లో ఎక్కువగా హాల్ చల్ చేసిన హీరోయిన్స్

2020లో సోషల్ మీడియా మరో లెవెల్ కు వెళ్లిందనే చెప్పాలి. గతంలో ఎప్పుడు లేనంతగా స్టార్స్ కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను. మరో ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇక అభిమానులు పోటాపోటీగా అభిమాన స్టార్స్ పేరును ట్రెండ్ అయ్యేలా ట్వీట్ చేస్తున్నారు. ఇక 2020లో సౌత్ ఇండియాలో ఎక్కువగా ట్వీట్ చేయబడిన హీరోయిన్స్ లిస్ట్ కూడా వచ్చేసింది.

2020 టాప్ ట్విట్టర్ హీరోయిన్స్..

2020 టాప్ ట్విట్టర్ హీరోయిన్స్..

ట్విట్టర్ ను దాదాపు మన స్టార్ హీరోలతో పాటు స్టార్స్ హీరోయిన్స్ కూడా గట్టిగానే ఫాలో అవుతున్నారు. సెలబ్రెటీలకు మరో ఆయుధంగా మారిన ట్విట్టర్ లోనే ఏ విషయన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. ఈ ఏడాది లాక్ డౌన్ కారణంగా అభిమానులకు సినిమాల పరంగా దూరంగా ఉన్న స్టార్స్ సోషల్ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. ఇక 2020లో సౌత్ హీరోయిన్స్ లలో ఎక్కువగా ట్వీట్ చేయబడిన వారిలో టాప్ 10 హీరోయిన్స్ వీళ్లే..

నెంబర్ వన్ స్థానంలో మహానటి

నెంబర్ వన్ స్థానంలో మహానటి

నెంబర్ వన్ స్థానంలో మహానటి కీర్తి సురేష్ నిలిచారు. లాక్ డౌన్ లో ఎక్కువగా ఆమె పెంగ్విన్ సినిమాతో సోషల్ మీడియాలో ఆమె పేరు బాగా వైరల్ అయ్యింది. అప్పట్లో ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అంటూ హవా చేసిన పెద్ద సినిమా అదే కావడంతో కీర్తి సురేష్ పేరు ఒక్కసారిగా మారు మ్రోగింది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిన్న ట్వీట్ చేసినా కూడా అభిమానులు ఆమె పేరును ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

కాజల్, సమంత పోటాపోటీగా..

కాజల్, సమంత పోటాపోటీగా..

ఇక రెండవ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలువగా, ఆ తరువాత సమంత మూడవ స్థానం దక్కించుకుంది. కాజల్ అగర్వాల్ ఈ ఏడాది పెళ్లి వేడుకతో ట్విట్టర్ లో బాగానే ట్రెండ్ అయ్యింది. ఇక మరోవైపు సమంత బిగ్ బాస్ ద్వారా అలగే లాక్ డౌన్ ఫొటోలతో సోషల్ మీడియాలో గట్టిగానే హడావుడి చేసింది. ఫ్యాన్స్ కూడా సమంత పేరును పుట్టినరోజున బాగానే ట్రెండ్ అయ్యేలా చేశారు.

 టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ 4,5 స్థానాల్లో

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ 4,5 స్థానాల్లో

ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న టాప్ హీరోయిన్స్ రష్మీక మందన్న. పూజా హెగ్డే. వీరు ఎక్కువగా ట్వీట్ చేయబడిన నటీమణుల లిస్ట్ లలో 4, 5 స్థానాల్లో నిలిచారు. వరుస విజయాలను అందుకోవడమే కాకుండా అగ్ర హీరోలతో సినిమాలు చేస్తుండడంతో వీరిద్దరు పేర్లను కూడా ఫ్యాన్స్ బాగానే వాడేశారు.

తమన్నా, తాప్సి హవా..

తమన్నా, తాప్సి హవా..

సొట్ట బుగ్గల సుందరి తాప్సి 6వ స్థానంలో నిలువగా.. ఇక మిల్కి బ్యూటీ తమన్నా 7వ స్థానంలో నిలిచి ఎప్పటిలానే తన సత్తా చాటింది. ఆ మధ్య కరోనా భారిన పడి సోషల్ మీడియాలో అమ్మడి పేరు చాలానే వైరల్ అయ్యింది. ఇక ఈ మధ్య బొద్దుగా మారడంతో ఆమె ఫొటోలను పదే పదే ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు అభిమానులు. మరో బ్యూటీ రకుల్ కూడా హాట్ ఫొటోస్ తో బాగానే ఎట్రాక్ట్ చేయడంతో ఆమె 8వ స్థానంలో నిలిచింది.

Recommended Video

2020 Most Tweeted Movies in Twitter| #Master| #VakeelSaab | #KGF2| #RRR
చివరలో త్రిష, శ్రుతి హాసన్

చివరలో త్రిష, శ్రుతి హాసన్

ఇక కోలీవుడ్ బ్యూటీస్ శ్రుతి హసన్, త్రిష చివరి రెండు స్థానాల్లో నిలిచారు. అసలైతే ఈ ఇద్దరు కూడా సినిమాలకు సంబంధించిన వార్తలతో పెద్దగా హడావుడి అయితే చేయలేదు. శృతితో పోలిస్తే త్రిష అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన ఒకటి రెండు విషయాలను మాత్రమే చెప్పింది. ఎక్కువగా గ్లామర్ లుక్స్ తోనే ఆకట్టుకున్నారు. ఎక్కువగా ట్వీట్ చేయబడిన సౌత్ నటిమణుల్లో శృతి 9వ స్థానంలో నిలువగా త్రిష 10వ స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X