సమంతను వెనక్కి నెట్టలేకపోతున్న తెలుగు బ్యూటీలు.. ఆరో స్థానానికే అంకితమైన రష్మిక మందన్నా!

దేశవ్యాప్తంగా ఉన్న సినీ తారల్లో టాప్ 10 లిస్టులో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు లాస్ట్ లో ఉన్నారు అనే దాని గురించి ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎవరికి సంబంధించిన అభిమానులు వాళ్లే టాప్ లో ఉండాలని కోరుకుంటారు. కోరుకోవడమే కాదండోయ్.. మా అభిమాన హీరోయినే టాప్ లో ఉందంటూ కూడా చెప్పుకొస్తారు.

అయితే ఇలాంటి వాళ్లందరికీ ఎవరు టాప్ లో ఉన్నారనే దానిపై క్లారిటీ ఇస్తూ ఉంటుంది ఆర్మాక్స్ మీడియా సంస్థ వెల్లడిస్తుంది. ముఖ్యంగా ప్రతీ నెల దీనిపై సర్వే చేసి మరీ సరైన ఫలితాలను వెల్లడిస్తుంటుంది. అయితే 2024 ఎప్రిల్ నెలకు సంబంధించిన టాప్ 10 హీరోయిన్లలో ఎవరెవరు ఉన్నారనే దాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించింది.

2024 April Top 10 Heroine in India Samantha Kajal Aggarwal Anushka Shetty And Full Details Here

ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎక్స్ వేదికగా ఈ టాప్ 10 హీరోయిన్ల లిస్టును విడుదల చేసింది కూడా. అయితే పూర్తిగా అభిమానుల ఓటింగ్ పై మాత్మరే ఆధారపడి చేసిన ఈ సర్వేలో సమంతను ఎవరూ వెనక్కి నెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా ఆమెనే టాప్ 1లో నిలుస్తోంది. సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ట్రెండింగ్ లో నిలుస్తుంది. ఇక టాప్ 2లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నిలిచింది. ఇటీవలే కాజల్ కార్తీక సినిమాతో వచ్చిన ఈమె మరోసారి సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది.

2024 April Top 10 Heroine in India Samantha Kajal Aggarwal Anushka Shetty And Full Details Here

ఇక టాప్ 3లో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నిలిచింది. చాలా రోజులుగా ఈమె ఎక్కువగా సినిమాలు చేయకపోయినా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇటీవలే మిస్​ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కనిపించి సక్సెస్ సాధించిన ఈమె మళ్లీ ఎలాంటి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. అలాగే నాలుగో స్థానంలో శ్రీలీల నిలిచింది. టాలీవుడ్ క్యూట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంతో వచ్చి హిట్ కొట్టింది. ఇలా ట్రెండింగ్ లో నిలిచిందీ ముద్దుగుమ్మ.

2024 April Top 10 Heroine in India Samantha Kajal Aggarwal Anushka Shetty And Full Details Here

ఇక ఐదో స్థానంలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి నిలిచింది. చాలా కాలంగా ఒక్క సినిమా కూడా చేయని ఈమె ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది. వీరిద్దరి కాంబోలో సినిమా రావడం ఇది రెండోసారి. ముఖ్యంగా బుజ్జితల్లిగా కనిపించి మెస్మరైజ్ చేసేందుకు ఈ ముద్దుగుమ్మ రెడీగా ఉంది. ఇక టాప్ 6లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నిలిచింది. యానిమల్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈమె ప్రస్తుతం పుష్ప2తో పాటు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. చూడాలి మరి ఈ రెండు చిత్రాలు ఏ రేంజ్ లో హిట్ కొడతాయమనేది.

2024 April Top 10 Heroine in India Samantha Kajal Aggarwal Anushka Shetty And Full Details Here

ఏడో స్థానంలో తమన్నా భాటియా నిలిచింది. తెలుగులో భోళా శంకర్, జైలర్ సినిమాల్లో నటించిన ఈమె గతేడాది లస్ట్ స్టోరీస్ 2లో కూడా కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇక టాప్ 8లో కీర్తి సురేష్ నిలిచింది. దసరా సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈమె ఆ తర్వాత ఎలాంటి చిత్రంలోనే కనిపించలేదు. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు, ఎవరితో కలిసి థియేటర్లలోకి రాబోతుందో. ఇక చివరి రెండు స్థానాల్లో అంటే టాప్ 9, 10లలో పూజా హెగ్డే, అనుపమ పరమేశ్వరన్ లు నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X