Top 10 Heroines: సినిమాలు చేయకపోయినా తగ్గని క్రేజ్.. టాప్ 1లో సమంత, మిగతా స్థానాల్లో ఎవరున్నారంటే?

ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు హీరో, హీరోయిన్లపై సినిమాలు, వెబ్ సిరీస్ లపై సర్వేలు చేస్తూ ఉంటుంది. వారానికోసారి, నెలకోసారి, ఏడాదికోసారి అనేక విషయాలపై సర్వేలు చేస్తూ టాప్ 10 సినిమాలు, టాప్ 10 హీరోలు, టాప్ 10 హీరోయిన్లు, టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టును విడుదల చేస్తుంటుంది. అలాగే సీరియల్ నటులు, సీరియల్స్... ఇలా అన్నింటిపై సర్వేలు చేస్తుంటుంది. అయితే తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించి టాప్ 10 హీరోయిన్ల లిస్టును విడుదల చేసింది.

2024 ఫిబ్రవరి నెలక సంబంధించి మోస్ట్ పాపులర్ టాలీవుడ్ హీరోయిన్లపై సర్వేలు చేయగా.. ఆడియన్స్ తమకు నచ్చిన వాళ్లను టాప్ 10లో ఉంచారు. వీళ్లలో సినిమాలు చేసిన వారికంటే కూడా ఏడాదిగా ఎలాంటి సినిమాల్లో కనిపించని వారికి కూడా స్థానం కల్పించారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయిన సమంతయే మళ్లీ ఈసారి టాప్ 1లో నిలిచింది. మరి ఎగతా స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2024 February Top 10 Heroines in Tollywood Samantha kajal Aggarwal Sreeleela Sai Pallavi Full Details Here

గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలు చేసిన సమంత ఈ మధ్య కాలంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆరోగ్యం బాగాలేక కాస్త గ్యాప్ ఇచ్చిన ఈమె ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించకపోయినా ఆమెకు క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. చాలా రోజులుగా ఈ ముద్దుగుమ్మనే టాప్ 1లో నిలుస్తోంది. ఇక టాప్ 2లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నిలిచింది. ఈ ముద్దుగుమ్మ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి సినిమాలో నటించి మెప్పించింది. ఇక టాప్ లో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల నిలిచింది.

2024 February Top 10 Heroines in Tollywood Samantha kajal Aggarwal Sreeleela Sai Pallavi Full Details Here
శ్రీలీల ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాలో నటించి మెప్పించింది. తన అందం, అభినయం, అదిరిపోయే స్టెప్పులతో విపరీతమైన అవకాశాలు దక్కించుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటోంది. ఇక టాప్ 4లో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి నిలిచింది. ఈ ముద్దుగుమ్మ అక్కినేని నాగ చైతన్య హీరోగా చేస్తున్న తండేల్ సినిమాలో నటిస్తుండగా... ఇటీవలే ట్రైలర్ విడుదల అయింది. ఇలా ఈ ముద్దుగుమ్మ టాప్ లో నిలిచింది.
2024 February Top 10 Heroines in Tollywood Samantha kajal Aggarwal Sreeleela Sai Pallavi Full Details Here

ఇక టాప్ 5లో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి స్థానం సంపాధించుకుంది. ఈమె చేసే సినిమాలు చాలా తక్కువే అయినా ఈమెకు నెత్తిన పెట్టి చూసుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. 2023లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాల్లో నటించి సూపర్ హిట్ కొట్టిన ఈమె.. ఈ మధ్య ఏ సినిమా చేయలేదు. ఇక టాప్ 6లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్థాననం సంపాధించుకుంది. యానిమల్ సినిమాలో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఈ భామ.. ఇప్పుడు పుష్ప2తో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

2024 February Top 10 Heroines in Tollywood Samantha kajal Aggarwal Sreeleela Sai Pallavi Full Details Here

టాప్ 7లో టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా నిలిచింది. 2023లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ చేసిన ఈమె భోళా శంకర్, జైలర్ చిత్రాల్లోనూ కనిపించింది. కానీ ఆ తర్వాత ఎలాంటి చిత్రంలోనూ కనిపించలేదు. ఇక ఎనిమిదో స్థానంలో కీర్తి సురేష్ నిలిచింది. గతేడాది దసరాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈమె ఇప్పుడు ఏ సినిమా చేయట్లేదు. ఇక టాప్ 9లో బుట్టబొమ్మ పూజా హెగ్డే నిలిచింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరసు ఆఫర్లు అందుకున్న ఈమె.. ప్రస్తుతం ఆఫర్లు లేక సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇక చివరలో అంటే టాప్ 10లో అనపమ పరమేశ్వరన్ నిలిచింది. టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధుతో విపరీతమైన రొమాన్స్ చేయబోతున్న ఈమె ఈ మధ్య ట్రెండింగ్ లోకి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X