Top 10 Heroines: బాలీవుడ్‌ను ఏలేస్తున్న టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. ఆలియా, రష్మిక స్థానాలు ఎంతంటే?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా డిసెంబర్ 2024 జనవి నెలకు సంబంధించి బాలీవుడ్లో ఉన్న టాప్ 10 హీరోయిన్లు వీరే అంటూ ఓ లిస్టును రిలీజ్ చేసింది. ఈ జాబితాను ఆర్మాక్స్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఎప్పటి మాదిరిగానే తన సత్తా చాటుకుంటూ ఆలియా భట్ మొదటి స్థానంలో ఉంటూ తనకు తిరుగులేదనిపించుకుంది. మిగతా హీరోయిన్లు ఎవరు ఏ స్థానంలో వారు నిలిచారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సినీ తారల విషయంలో ఎవరు టాప్ అనేది ఎప్పటికీ తెగని అంశమే. వారు చేసే సినిమాలు, వచ్చే అవకాశాలు.. అందులో వారు కనబర్చిన నటనను బట్టి నెలకో రకంగా స్థానాలు దక్కించుకంటూ ఉంటారు సెలబ్రిటీలు. అయితే సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్లలో ఎవరు ఏయే స్థానాల్లో ఉన్నారో చేసే సర్వేలు ఎక్కువ అయ్యాయి. అలా నెలకోసారి కచ్చితంగా జరిపే ఈ సర్వేలో అనేక మంది అభిమానులు పాల్గొంటూ తమకు నచ్చిన వారి టాప్ కు తీసుకెళ్తుంటారు. అయితే 2024 జనవరి నెలకు గానూ బాలీవుడ్లో టాప్ హీరోయిన్లు వీరే అంటూ ఓ లిస్ట్ విడుదల చేసింది.

టాప్ 10 బాలీవుడ్ హీరోయిన్లలో నంబర్ వన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నిలిచింది. అలియా భట్ బాలీవుడ్ భామ అయినా... ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు వారికి కూడా పరిచయం అయింది. ఈ సినిమాతోనే గతేడాది టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక రెండో స్థానంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె నిలిచింది. ఇటీవల జవాన్ సినిమాలో అథితి పాత్రలో నటించిన ఈ భామ కుర్రకారు మదిలో స్థానం సంపాధించుకుంది.

ఇక టాప్ 3లో కత్రీనా కైఫ్ నిలిచింది. ఈ భామ ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. అయినా కత్రీనా సీన్స్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే టాప్ 4లో కియారా అడ్వాణీ స్థానం దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గమే ఛేంజర్ సినిమాతో పాటు.. సత్య ప్రేమ్ కీ కథ అనే హిందీ సినిమాలోనూ నటిస్తోంది.

ఇక టాప్ 5లో కృతి సనన్ నిలిచింది. గతేడాది ఆది పురుష్ సినిమాతో పాటు గణ్ పథ్ చిత్రంలో నటించిన ఈమెకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. ఇక టాప్ 6లో శ్రద్ధా కపూర్ నిలిచింది. టాప్ 7లో కరీనా కపూర్ నిలవగా.. 8వ స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నిలిచింది. ఇటీవలే యానిమల్ తో ట్రెండ్ సెట్ చేసిన ఈమె తర్వాతి స్థానంలో అంటే 9వ ప్లేస్ లో ప్రియాంక చోప్రాన్ జోనస్ ఉన్నారు. చివరలో అనుష్క శర్మ నిలిచింది.


Click it and Unblock the Notifications











