Top 10 Heroines: తెలుగు టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. పదో స్థానంలో టిల్లుగాడి బ్యూటీ, వన్‌లో ఎవరంటే?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటికప్పుడు సినీ తారలు, సినిమాలు, వెబ్ సిరీస్ లపై సర్వే చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ వారం, ప్రతీ నెల, ప్రతీ ఏడాది.. టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్ లు, హీరోహీరోయిన్లు, అలాటే టెలివిజన్ షోలు, సీరియల్స్... ఇలా అన్నింటిపై సర్వేలు చేస్తూ సరైన ఫలితాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా 2024 జనవరి నెలకు సంబంధించిన టాప్ 10 హీరోయిన్లు లిస్టును విడుదల చేసింది. అందులో ఎవరెవరు ఉన్నారు, ఏయే స్థానాల్లో ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి 2024 టాప్ 10 తెలుగు హీరోయిన్లలో నెంబర్ వన్ స్థానంలో సమంత ఉంది. 2023లో శాకుంతలం, ఖుషి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్.. ఆ తర్వాత ఎలాంటి చిత్రాల్లోనూ కనిపించలేదు. కానీ ఆమెకున్న క్రేజ్ మాత్రం అస్సలే తగ్గట్లేదు. చాలా కాలంగా నెంబర్ వన్ స్థానంలో ఈ ముద్దుగుమ్మే నిలుస్తుంది. ఇక టాప్ టాప్ 2, 3లో భగవంత్ కేసరి సినిమాల్లో నందమూరి బాలకృష్ణ పక్కన నటించిన ముద్దుగుమ్మలు స్థానం దక్కించుకున్నారు. టాప్ 2లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నిలిచింది.

ఇక టాప్ 3లో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల నిలిచింది. ఇటీవలే శ్రీలీల మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారంలో నటించి అందరినీ మెప్పించింది. ముఖ్యంగా కుర్చి మడత పెట్టి పాటకు మస్త్ మస్త్ స్టెప్పులు వేసి అందిరనీ మెస్మరైజ్ చేసింది. ఇలా టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంటూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక టాప్ 4లో నాలుగో స్థానంలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నిలిచింది. ఈ భామ సినిమాలు తక్కువే. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని పలకరించేది తక్కువే. అయినా సరే ఆమెకు అభిమానులు గుండెల్లో గూడు కట్టేసుకున్నారు. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాల్లో నటించిన ఈమె తర్వాత మళ్లీ కనిపించలేదు.
ఇక టాప్ 5లో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి నిలిచింది. అక్కినేని నాగచైతన్య సరసన ఈ ముద్దుగుమ్మ తండేల్ సినిమాలో నటిస్తోంది. ఇందులో బుజ్జమ్మగా.. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తోందీ క్యూట్ బ్యూటీ. ఇటీవలే ట్రైలర్ విడుదల కాగా.. మళ్లీ టాప్ లోకి వచ్చేసింది. ఇక టాప్ 6లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్థాననం సంపాధించుకుంది. యానిమల్ సినిమాతో 2023లో భారీ హిట్ కొట్టేసింది రష్మిక. ఈ సినిమాతో అటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ ఆమె పేరు మార్మోమ్రోగిపోయింది.

ఇక ఏడో స్థానంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే నిలిచింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరసు ఆఫర్లు అందుకున్న ఈమె.. ప్రస్తుతం ఆఫర్లు లేక సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇక టాప్ 8లో టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా నిలిచింది. గతేడాది లస్ట్ స్టోరీస్ లో నటించిన ఈమె.. తెలుగులో భోళా శంకర్, జైలర్ సినిమాల్లో నటించింది. అలాగే టాప్ 9లో దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన కీర్తి సురేశ్ నిలవగా.. పదో స్థానంలో అనపమ పరమేశ్వరన్ నిలిచింది. టిల్లు స్క్వేర్ సినిమాతో మనముందుకు రాబోతున్న ఈమె.. ట్రైలర్ తోనే యమా పాపులారిటీ దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











