Top 10 Heroine: తెలుగులో టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. వన్‌లో సామ్.. రష్మిక స్థానం ఎంతంటే?

హీరోహీరోయిన్లు, సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇలా ఎవరు టాప్, ఏది టాప్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తే టాప్ లోకి రావడం.. లేదంటే చివరకు రావడం ఎప్పుడూ జరుగుతుండేదే. ముఖ్యంగా హీరోహీరోయిన్ల అభిమానులు అయితే తమ అభిమాన నటులే టాప్ లో ఉండాలని కోరుకుంటారు. వాళ్లే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారంటూ పోట్లాడుకుంటారు కూడా. అయితే ఇలాంటి వాటిపై సర్వేలు చేసి మరీ సరైన ఫలితాలను వెల్లడిస్తుంటుంది ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్. 2024 మార్చి నెలకు సంబంధించిన టాప్ 10 హీరోయిన్ల ఎవరన్న దానిపై సర్వే చేసి మరీ ఫలితాలు తెలిపింది.

ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎక్స్ వేదిగా ఈ టాప్ 10 హీరోయిన్ల లిస్టును విడుదల చేసింది కూడా. అయితే కేవం అభిమానుల ఓటింగ్ పై మాత్రమే ఆధారపడి చేసే ఈ సర్వేలో టాప్ 1లో ఎప్పటిలాగే సమంత నిలిచింది. చాలా కాలంగా మొదటి స్థానాన్ని సమంతయే దక్కించుకుంటుంది. సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ట్రెండింగ్ లో నిలుస్తుంది. ఇక టాప్ 2లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నిలిచింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కాజల్ కార్తీక సినిమాతో రాగా.. ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. కానీ తన క్రేజ్ పడిపోకుండా.. తెగ రచ్చ చేస్తోంది.

2024 March Top 10 Heroine in India Samantha Kajal Aggarwal Anushka Shetty Sreeleela Full Details Here

ఇక టాప్ 3లో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నిలిచింది. ఈమె ఈ మధ్య ఎక్కువగా సినిమాలు చేయకపోయినా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇటీవలే మిస్​ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కనిపించి సక్సెస్ సాధించిన ఈమె మళ్లీ ఎలాంటి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. అలాగే నాలుగో స్థానంలో శ్రీలీల నిలిచింది. టాలీవుడ్ క్యూట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంతో వచ్చి హిట్ కొట్టింది. ఇలా ట్రెండింగ్ లో నిలిచిందీ ముద్దుగుమ్మ.

2024 March Top 10 Heroine in India Samantha Kajal Aggarwal Anushka Shetty Sreeleela Full Details Here

టాప్ 5లో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి నిలిచింది. చాలా కాలంగా ఈమె ఎలాంటి చిత్రాలతో రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాలో బుజ్జితల్లిగా కనిపించి మెస్మరైజ్ చేసేందుకు రాబోతుందది. ఇక టాప్ 6లో రష్మిక మందన్నా నిలిచింది. యానిమల్ సినిమాతో 2023లో భారీ హిట్​ కొట్టేసిన ఈమె ఇప్పుడు పుష్ప 2 సినిమాతో వచ్చి మళ్లీ సక్సెస్ కొట్టేందుకు సిద్ధంగా ఉంది.

2024 March Top 10 Heroine in India Samantha Kajal Aggarwal Anushka Shetty Sreeleela Full Details Here

ఇక టాప్ 7లో కీర్తి సురేష్ నిలిచింది. దసరా సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈమె ఆ తర్వాత ఎలాంటి సినిమాలోనూ కనిపించలేదు. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు, ఎవరితో కలిసి థియేటర్లలోకి రాబోతుందో. ఇకా టాప్ 8లో తమన్నా భాటియా నిలిచింది. తెలుగులో భోళా శంకర్, జైలర్ సినిమాల్లో నటించిన ఈమె గతేడాది లస్ట్ స్టోరీస్ 2లో కూడా కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇక 9, 10 స్థానాల్లలో పూజా హెగ్డే, అనుపమ పరమేశ్వరన్ లు నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X