Top 10 Heroines: బాలీవుడ్ భామలను వెనక్కి నెట్టిన సమంత.. దేశం మెచ్చిన టాప్ 10 హీరోయిన్లు వీళ్లే!

ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు దేశంలోని సినిమాలు, సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తూ.. ఫలితాలను అందిస్తుంటుంది. అయితే తాజాగా 2024 జనవరికి సంబంధించిన ఇండియన్ టాప్ 10 హీరోయిన్ల లిస్టును విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎక్స్ వేధికగా ఈ లిస్టును రిలీజ్ చేసింది. అందులో అంటే టాప్ 10 ఇండియన్ హీరోయిన్ల లిస్టులో సమంత ఉంది. బాలీవుడ్ భామలను కూడా వెనక్కి నెట్టిన ఈ క్యూట్ బ్యూటీకి క్రేజ్ ఎంత ఉందో ఈ లిస్టు ద్వారా తెలిసిపోతుంది.

టాప్ 1 స్థానంలో నిలిచిన సమంత ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకుంది. 2023లో శాకుంతలం, ఖుషి వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో హిట్టు కొట్టలేకపోయింది. ఇక టాప్ 2లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నిలిచింది. భగవంత్ కేసరి సినిమాతో గతేడాది హిట్టు కొట్టిన ఆమె సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక టాప్ 2లో బాలీవుడ్ భామ ఆలియా భట్ నిలిచింది. గతేడాది రాకీ ఔర్ రాణీ కీ ప్రమే కహాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె బిడ్డ పుట్టడంతో కాస్త బ్రేక్ ఇచ్చింది.

https://telugu.filmibeat.com/photos/feature/anchor-anasuya-bharadwaj-beautiful-saree-photos-fb92616.html

ఇక టాప్ 3లో దీపికా పదుకొణె నిలిచింది. ఈ ముద్దుగుమ్మ గతేడాది పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నచిస్తుంది. ముఖ్యంగా ఫైటర్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక టాప్ 4లో నయనతార నిలిచింది. గతేడాది ఇరైవన్, జవాన్, అన్న పూరణి వంటి అద్భుతమైన సినిమాలతో వచ్చి హిట్లు కొట్టింది. అలా సూపర్ క్రేజ్ దక్కించుకుందీ ముద్దుగుమ్మ.

ఇక టాప్ 5లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నిలిచింది. భగవంత్ కేసరి సినిమాతో గతేడాది హిట్టు కొట్టిన ఆమె సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక టాప్ 6లో త్రిష నిలిచింది. ఇటీవలే ది రోడ్ సినిమాతో వచ్చి అందరినీ మెప్పించిందీ ముద్దుగుమ్మ. అలా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఇక టాప్ 7లో కత్రినా కైఫ్ నిలిచింది. గతేడాది ఆమె టైగర్ 3 సినిమాతో హిట్టు కొట్టింది. ప్రస్తుతం మేరీ క్రిస్మస్ సినిమాలో నటిస్తోంది.

2024 Top 10 heroines in India: Samantha in Top 1 Place And Alia Bhatt in Second Place Check Full Details

ఇక టాప్ 8లో కియారా అడ్వాణీ నిలవగా... ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ హీరోగా రాబతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది. అలాగే సత్య ప్రేమ్ కి కథ అనే సినిమాలో కూడా కనిపించబోతుంది. టాప్ 9లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నిలిచింది. ఇటీవలే యానిమల్ సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చి అందరి చేత ప్రశంసలు పొందింది. ఈ సినిమాతో అటు టాలీవుడ్, బాలీవుడ్​లోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు వస్తుంది.

అలాగే టాప్ 10లో అంటే చివరి స్థానంలో అనుష్క శెట్టి నిలిచింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమెను అభిమానులు బాగానే ఆదరించారు. ఈమె ఎక్కువగా సినిమాలు చేయకపోయినా తెలుగు వారు ఆరాధిస్తూనే ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X