Top 10 Heroines: తెలుగులో టాప్ 10 హీరోయిన్స్ వీళ్లే.. నంబర్ 1 ఎవరో తెలుసా?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా డిసెంబర్ 2023కి సంబంధించి టాలీవుడ్లో ఉన్న టాప్ 10 హీరోయిన్లు వీరే అంటూ ఓ లిస్టును రిలీజ్ చేసింది. ఈ జాబితాను ఆర్మాక్స్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఎప్పటి మాదిరిగానే తన సత్తా చాటుకుంటూ సమంత మొదటి స్థానంలో ఉంటూ తనకు తిరుగులేదనిపించుకుంది. మిగతా హీరోయిన్లు ఎవరు ఏ స్థానంలో వారు నిలిచారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హీరోలు, హీరోయిన్ల విషయంలో ఎవరూ టాప్ అనేది ఎప్పటికీ అంతుచిక్కని విషయమే. నువ్వా నేనా అనే రేంజ్లో హీరో హీరోయిన్ల అభిమానులు మా హీరో తోపు.. మా హీరోయిన్ నెంబర్ 1 అనుకుంటూ ఫ్యాన్ వార్స్ చేసేసుకుంటారు. సోషల్ మీడియా వచ్చాక ఈ వార్స్‌కి లెక్కే లేదు. ముఖ్యంగా టాలీవుడ్లో ఈ ఫ్యాన్స్ పంచాయితీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సమయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఆర్మాక్ మీడియా సంస్థ డిసెంబర్ 2023కు గానూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్లు వీరే అంటూ ఓ లిస్ట్ విడుదల చేసింది. ప్రతినెల సోషల్ మీడియాలో, జనాల్లో, సినిమాల్లో ఎవరూ టాప్‌లో ఉంటారో వారి లిస్ట్ తయారు చేసి ఆర్మాక్స్ రిలీజ్ చేస్తుంది.

ఆర్మాక్స్ రిలీజ్ చేసిన టాప్ 10 హీరోయిన్ల లిస్ట్‌లో టాప్ 1లో సమంత ఉంది. 2023లో శాకుంతలం, ఖుషి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. అవి అంతగా ఆకట్టుకోకపోయినా అభిమానులు మాత్రం ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఆమె ఫ్యాన్స్‌కు అందుబాటులోనే ఉంటుంది. ఆమె వెకేషన్స్, లైఫ్ స్టైల్‌కి సంబంధించిన దాదాపు అన్ని మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను మాయ చేస్తుంది ఈ బ్యూటీ.
టాప్ 2, 3లో భగవంత్ కేసరి హీరోయిన్లు నిలిచారు. టాప్ 2లో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నిలవగా.. టాప్ 3లో యంగ్ జనరేషన్ హీరోయిన్ శ్రీలీల కొట్టేసింది. వీరిద్దరూ కలిసి నటించిన భగవంత్ కేసరి మంచి టాక్‌నే సంపాదించుకుంది. తల్లి అయిన తర్వాత ప్రేక్షకులకు దూరమైన కాజల్ ఈ సినిమాతో మళ్లీ దగ్గరైంది. శ్రీలీల మాత్రం వరుస ఆఫర్లతో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఈ సంక్రాంతికి వచ్చేస్తుంది.

నాలుగో స్థానంలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నిలిచింది. ఈ భామ సినిమాలు తక్కువే. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని పలకరించేది తక్కువే. అయినా సరే ఆమెకు అభిమానులు గుండెల్లో గూడు కట్టేసుకున్నారు. ఈ సంవత్సరం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కనిపించేసరికి అభిమానులు పండుగ చేసుకున్నారు. రష్మిక ఆర్మాక్స్ లిస్ట్‌లో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. యానిమల్ సినిమాతో 2023లో భారీ హిట్ కొట్టేసింది రష్మిక. ఈ సినిమాతో అటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ ఆమె పేరు మార్మోమ్రోగిపోయింది.
సినిమాలే చేయకపోయినా సాయిపల్లవి ఆరవ స్థానంలో నిలిచింది. మరోసారి నాగచైతన్యతో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. తండేల్ సినిమాలో బుజ్జితల్లిగా మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. లస్ట్ స్టోరిస్ సిరీస్‌తో తమన్నా చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. మునుపెన్నడు లేని విధంగా కొత్తగా కనిపించిన తమన్నా 7వ స్థానంలో నిలిచింది. తెలుగులో భోళా శంకర్, జైలర్ సినిమాల్లో నటించింది. ఈ ఏడాది తన బాయ్‌ఫ్రెండ్ గురించి రివిల్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన కీర్తి సురేశ్ ఆర్మాక్స్ లిస్ట్‌లో 8వ స్థానంలోనే మిగిలిపోయింది. తొమ్మిదో స్థానంలో పూజా హెగ్డే నిలవగా.. సలార్ హీరోయిన్ శృతిహాసన్ మాత్రం.. సినిమాతో హిట్ కొట్టినా సరే.. 10 స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











