Top 10 Heroines: టాప్ 10 తెలుగు హీరోయిన్స్ వీళ్లే.. నంబర్ 1లో సమంత.. రష్మిక స్థానం ఎంతంటే?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు హీరో, హీరోయిన్లు.. సినిమాలపై సర్వేలు నిర్వహిస్తూ ఫలితాలను వెల్లడిస్తుంటుంది. అయితే తాజాగా 2024 జనవరికి సంబంధించిన టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్ల లిస్టును విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎక్స్ వేధికగా ఈ లిస్టును రిలీజ్ చేసింది. అందులో అంటే టాప్ 10 తెలుగు హీరోయిన్ల లిస్టులో సమంత నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. కాజల్ రెండో స్థానానికి చేరిపోయింది. మిగతా స్థానాల్లో ఏ హీరోయిన్లు ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్మాక్స్ సంస్థ రిలీజ్ చేసిన ఈ మోస్ట్ పాపులర్ టాప్ 10 టాలీవుడ్ హీరోయిన్ల లిస్టులో ఎప్పటిలాగే స్టార్ హీరోయిన్ సమంత నిలిచింది. గతేడాది అంటే 2023లో శాకుంతలం, ఖుషి వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంతకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. సినిమాలు ఆకట్టుకోకపోయినా ఆమె ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ ఆమెనే ఆరాధిస్తున్నారు. అలా ఆ ముద్దుగుమ్మ టాప్ 1 లోకి వచ్చేసింది. ఇక టాప్ 2లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నిలిచింది. భగవంత్ కేసరి సినిమాతో గతేడాది హిట్టు కొట్టిన ఆమె సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2024 Top 10 heroines in Tollywood: Samantha in Top 1 Place And Kajal Aggarwal in Top 2 Check Full Details

ఇక టాప్ 3లో అనుష్క శెట్టి నిలిచింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమెను అభిమానులు బాగానే ఆదరించారు. ఈమె ఎక్కువగా సినిమాలు చేయకపోయినా తెలుగు వారు ఆరాధిస్తూనే ఉన్నారు. ఇలా ఈ ముద్దుగుమ్మ మూడో స్థానంలో నిలిచింది. ఇక టాప్ 4లో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి నిలిచింది. ప్రస్తుతం హీరో నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముఖ్యం బుజ్జితల్లిగా కనిపించి మెస్మరైజ్ చేసేందుకు రెడీగా ఉంది.

2024 Top 10 heroines in Tollywood: Samantha in Top 1 Place And Kajal Aggarwal in Top 2 Check Full Details

ఇక టాప్ 5లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నిలిచింది. ఇటీవలే యానిమల్ సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చి అందరి చేత ప్రశంసలు పొందింది. ఈ సినిమాతో అటు టాలీవుడ్, బాలీవుడ్​లోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు వస్తుంది. టాప్ 6లో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల నిలిచింది. ఇటీవలే గుంటూరు కారంలో మహేష్ బాబు సరసన మస్తు మస్తు స్టెప్పులేసి మరింత క్రేజ్ తెచ్చుకుంది.

2024 Top 10 heroines in Tollywood: Samantha in Top 1 Place And Kajal Aggarwal in Top 2 Check Full Details

ఇక టాప్ 7లో కీర్తి సురేషన్ నిలిచింది. దసరా సినిమా గతేడాది సూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈ క్యూట్ బ్యూటీ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఆర్మాక్స్​ లిస్ట్​లో 8వ స్థానంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే నిలిచింది. ఇక 9వ స్థానంలో మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా నిలవగా.. పదో స్థానంలో అనుపమ పరమేశ్వరన్ చేరిపోయింది. ఈ లిస్ట ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా వీళ్ల కొత్త సినిమాలు రావడం, అందులో వారి నటన బాగుంటే ఆమే టాప్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X