4 పెళ్లిళ్లు, 7 ఎంగేజ్‌మెంట్స్... అయినా సుఖం దక్కలేదంటున్న స్టార్ హీరోయిన్

సినీ ఇండస్ట్రీ ఇదోక గ్లామర్ ప్రపంచం. ఇందులో సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. గ్లామర్, పేరు, డబ్బు అన్నీ ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత జీవితంలో కోరుకున్న సంతోషం పొందలేకపోతున్నారంట. అలాగే.. ఓ హాలీవుడ్ స్టార్ హీరోయిన్... ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు, ఏడు ఎంగేజ్‌మెంట్స్, పలువురితో డేటింగ్ చేసిన.. 'నిజమైన ప్రేమ దక్కలేదు' అని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. బయటకు కనిపించే సక్సెస్ వెనుక ఉన్న ఒంటరితనం, భావోద్వేగం దాగి ఉన్నాయనీ ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు గ్లోబల్‌గా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? అసలేం జరిగింది?

ఆ బ్యూటీ ఎవరో కాదు.. పాప్ గాయని, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ (Jennifer Lopez). హాలీవుడ్‌లో గ్లామర్, టాలెంట్‌కు ప్రతీకగా నిలిచిన జెన్నిఫర్ లోపెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆమె, సింగర్, డ్యాన్సర్, నటి గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 1969 జూలై 24న న్యూయార్క్‌లో జన్మించిన జెన్నిఫర్, మొదట టెలివిజన్‌లో 'ఇన్ లివింగ్ కలర్' అనే కామెడీ షోలో ఫ్లై గర్ల్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి, తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో వేగంగా ఎదిగింది.

4 Marriages 7 Engagements Jennifer Lopez Says She Never Found True Love

సంగీత రంగంలో సూపర్ హిట్ ఆల్బమ్‌లతో గ్లోబల్ స్టార్‌గా మారిన జెన్నిఫర్, నటిగా కూడా తన సత్తా చాటుకుంది. కేవలం డ్యాన్స్, సింగింగ్‌కే పరిమితం కాకుండా, యాక్షన్, రొమాన్స్, డ్రామా అన్ని జానర్‌లలో నటిస్తూ తన వర్సటిలిటీని నిరూపించింది. ముఖ్యంగా 'అనకొండ', 'ఇనఫ్', 'షాట్‌గన్ వెడ్డింగ్', 'ది మదర్' వంటి చిత్రాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. హాలీవుడ్‌లో తనకంటూ ఒక బ్రాండ్‌గా ఎదిగిన జెన్నిఫర్ లోపెజ్, ప్రతిభతో పాటు కష్టపడి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తోంది. సంగీతం, సినిమా, స్టేజ్ అన్ని రంగాల్లో తన ముద్ర వేసిన ఆమె గ్లోబల్ ఐకాన్‌గా కొనసాగుతోంది.

ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. ప్రేమ, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు ఇవన్నీ ఆమె జీవితాన్ని ఒక రియల్ లైఫ్ రొమాంటిక్ డ్రామాగా మార్చాయి. ఇప్పటివరకు జెన్నిఫర్ లోపెజ్ మొత్తం నాలుగు సార్లు వివాహం చేసుకుంది. 1997లో క్యూబన్ నటుడు ఒజాని నోవాతో ఆమె మొదటి పెళ్లి జరిగింది, అయితే అది కేవలం ఏడాది కూడా పూర్తికాకముందే ముగిసింది. తర్వాత 2001లో డ్యాన్సర్ క్రిస్ జడ్‌ను వివాహం చేసుకున్న ఆమె, ఈ సంబంధాన్ని కూడా ఎక్కువకాలం కొనసాగించలేకపోయింది.

2004లో గాయకుడు మార్క్ ఆంథోనీను మూడో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. దాదాపు పదేళ్ల పాటు కలిసి జీవించిన తర్వాత వారు విడిపోయారు. కానీ, ఇప్పటికీ స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక 2022లో నటుడు బెన్ అఫ్లెక్‌ను నాలుగో పెళ్లి చేసుకుంది. 2002లోనే మొదటిసారి నిశ్చితార్థం చేసుకుని విడిపోయిన ఈ జంట, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కలుసుకుని పెళ్లి చేసుకున్నారు. జెన్నీఫర్ పెళ్లి లిస్టే కాదు.. డేటింగ్ హిస్టరీ కూడా చాలా పెద్దగానే ఉంది. సీన్ "డిడ్డీ" కోంబ్స్, కాస్పర్ స్మార్ట్, అలెక్స్ రోడ్రిగ్జ్ వంటి ప్రముఖులతో డేటింగ్ చేసినట్టు హాలీవుడ్ టాక్. ముఖ్యంగా అలెక్స్ రోడ్రిగ్జ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లి చివరకు విడిపోవడం పెద్ద చర్చకు దారి తీసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జెన్నిఫర్ మాట్లాడుతూ తన పర్సనల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాలుగు పెళ్లిళ్లు, ఏడు ఎంగేజ్‌మెంట్స్ జరిగినప్పటికీ 'నాకు ఎప్పుడూ నిజమైన ప్రేమ దక్కలేదు'అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎనాలేని స్టార్‌డమ్, సక్సెస్ అందుకున్న తాను.. ఎన్నో సంవత్సరాలుగా తనలో తాను బాధపడుతున్నాననీ, తనలోని భావోద్వేగాన్ని బయట ప్రపంచానికి చూపించకుండా దాచేశాయని చెప్పింది. 'నేను ప్రేమించదగిన వ్యక్తిని కాదని కాదు... కానీ కొంతమంది నిజంగా ప్రేమించలేరు" అని ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాగే, జీవితంలో నేర్చుకున్న పెద్ద పాఠం 'సెల్ఫ్ లవ్'అని ఆమె పేర్కొంది. బయట ఎంత సక్సెస్ ఉన్నా, మనసుకు శాంతి కలిగించేది నిజమైన ప్రేమ, అర్థం చేసుకోవడమేనని ఆమె భావోద్వేగంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరలవుతున్నాయి. జెన్నిఫర్ లోపెజ్ చెప్పిన ఈ మాటలు ప్రేమ అనేది కేవలం సంబంధం మాత్రమే కాదు... పరస్పర గౌరవం, భావోద్వేగ అనుబంధం కూడా అవసరమని గుర్తు చేస్తున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి.

Read more about: jennifer lopez hollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X