41 ఏళ్ల సీనియర్ హీరోయిన్.. శ్రీలీలనే తలదన్నేలా.. ఇప్పుడామెనే హాట్ టాపిక్
చాలా సందర్భాల్లో ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అనే మాట వింటూనే ఉంటాం. మరి అది నిజమే అని ఎన్నెన్నో సందర్భాల్లో నిరూపితం కూడా అయ్యింది. కాగా అది ఏ రంగంలో చూసుకున్నా కూడా చాలా మంది ప్రముఖులు అసలు ఏజ్ తో సంబంధమే లేకుండా తమ యుక్త వయస్సులో ఎలా చేసారో వయస్సైనా కూడా ఇదే ఎనర్జీతో కనిపిస్తాయి. మరి ఇలా క్రికెట్ లో ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అనే మాట మహేంద్ర సింగ్ ధోని విషయంలో వింటూ ఉంటాం.
మరి తాజాగా తన రిఫరెన్స్ లు మెండుగా ఉన్న ఓ సినిమా విషయంలో మరోసారి ఈ ప్రస్తావన వచ్చింది. కాగా ధోని అంటేనే మొదటిగా గుర్తొచ్చేది తన డాషింగ్ గేమ్ అండ్ క్రేజ్ అనే చెప్పాలి. అదే క్రేజ్ తో చెన్నై టీంని ఐపీఎల్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ గా నిలిపాడు. అలాంటి ధోనీపై గట్టి ఎలివేషన్ చేసిన లేటెస్ట్ సినిమానే "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం".

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన ఈ సినిమాలో యెల్లో రంగులో కనిపించిన సర్ప్రైజ్ లు చాలానే ఉన్నాయి. కాగా అదే యెల్లో అండ్ 40 ఏళ్ళు దాటిన సీనియర్ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆమె ఎవరో కూడా కాదు సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. విజయ్ తో త్రిష గతంలో "గిల్లి" గత ఏడాది "లియో" సినిమాలు చేసింది.
ఇప్పుడు మళ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ఐటెం సాంగ్ లో కనిపించిఒక షాకింగ్ ట్రీట్ ని ఇచ్చింది. అయితే ఇందులో పసుపు రంగు చీరలో తన గ్లామర్ షోతోనే కాకుండా తన 41 ఏళ్ల వయసులో విజయ్ తో కలిసి సూపర్ స్టెప్పులు వేసింది. దీనితో సోషల్ మీడియాలో త్రిష పేరు మరోసారి వైరల్ గా మారింది. ఇంతేనా కొంతమంది అయితే ప్రెజెంట్ డాన్సింగ్ డైనమైట్ శ్రీలీల కూడా త్రిష ముందు పనికిరాదు అంటున్నారు.

ఈ ఏజ్ లో కూడా ఇంత ఎనర్జిటిక్ గా కనిపించి త్రిష అందరినీ ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. అలాగే ఆ షూటింగ్ టైం లో తీసుకున్న పిక్స్ ని కూడా త్రిష ఇటీవల షరీ చేయగా అవీ మంచి వైరల్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే సినిమాలో త్రిష ఎంట్రీ చూసి చాలా మంది తెలియని వాళ్లు మొదట శ్రీలీలనా అనుకున్నవారు కూడా లేకపోలేరు.. ఆ రేంజ్ లో త్రిష ఇప్పటికీ ఉంది అని చెప్పొచ్చు. ఇలా ఇపుడు మరోసారి త్రిష సినీ వర్గాల్లో నెటిజన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఇప్పుడు త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రం "విశ్వంభర" చేస్తుండగా ఇది సహా తెలుగు, తమిళ్ సినిమాలో మళ్ళీ భారీ ఆఫర్స్ అందుకొని పాత రోజుల తరహాలో బిజీగా ఉంది. ఇక విజయ్ ది గోట్ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, స్నేహలు కూడా నటించగా దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











