45 ఏళ్ల వయసులో రజనీ హీరోయిన్ మతిపోయే స్టెప్పులు.. తమన్నా, త్రిషాను మించి మంజు!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం వేట్టైయాన్: ది హంటర్. టీజే జ్ఞాన‌వేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ మూవీలోని పాటను ప్రేక్షకులు, అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ పాటలో మంజు వారియర్ వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

సుమారుగా 160 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితిక సింగ్, మంజువారియర్, రావు రమేష్, రోహిణి తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఆర్ కథిర్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

45 years old Manju Warrier dance moves trending after Rajinikanth s Vettaiyan s Manasilaayo Song release

వేట్టైయాన్ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని తాజాగా మనసిలాయో అనే పాటను లిరికల్ సాంగ్‌గా రిలీజ్ చేశారు. ఈ పాటలో అనిరుధ్ కూడా నటించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన పాటలో రజనీ, అనిరుధ్, మంజు వారియర్ డ్యాన్స్‌కు విశేషమైన ఆదరణ లభిస్తున్నది.

అనిరుధ్ మ‌రోసారి త‌న‌దైన పంథాలో బాణీల‌ను క్రేజీగా అందించారు. రజనీ ఫ్యాన్స్‌కు తగినట్టుగా మనసిలాయో.. అనే పాట‌ను కంపోజ్ చేశారు. శ్రీనివాస మౌళి రాసిన ఈ పాట‌ను న‌క‌ష్ అజీజ్‌, అరుణ్ కౌండిన్య‌, దీప్తి సురేష్ పాడారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌య‌మేమంటే ఈ పాట త‌మిళ వెర్ష‌న్ కోసం లెజెండ్రీ ప్లే బ్యాక్ సింగ్ మ‌లేషియా వాసుదేవ‌న్ వాయిస్‌ను AIలోక్రియేట్ చేసి ఇందులో ఉప‌యోగించటం విశేషంగా మారింది.

45 years old Manju Warrier dance moves trending after Rajinikanth s Vettaiyan s Manasilaayo Song release

మనసిలాయో పాటలో మంజు వారియర్ అనూహ్యమైన స్టెప్పులు వేశారు. ఆమె సాంగ్‌లో చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 45 ఏళ్ల వయసులో ఆమె వేగంగా లయబద్దంగా చేసిన నృత్యం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు చూసిన మంజు ఒకటి.. ఈ పాట తర్వాత చూసిన మంజు వేరు అంటూ కామెంట్ చేస్తున్నారు.

అంతేకాకుండా ఇటీవల రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో చేసిన తమన్నా భాటియా పాట, అలాగే విజయ్ నటించిన ది గోట్ సినిమాలో త్రిషా కృష్ణన్ చేసిన పాటను మించి మంజు వారియర్ పెర్ఫార్మెన్స్ చేసిందేమిటి? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాట 4.5 మిలియన్ వ్యూస్ సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X